చిరు – బాలయ్య – కమల్ – నాగ్ ఓకే ప్రేమ్‌లో… ఈ ఫొటో ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఇదే..!

లోకనాయకుడు కమలహాసన్, మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, మన్మధుడు నాగార్జున.. ఈ నలుగురు స్టార్ హీరోలు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే వారి అభిమానులకు అది ఫుల్ కిక్‌ ఇస్తుంది. వరుస‌ సినిమాల్లో బిజీగా ఉండే ఈ అగ్ర హీరోలందరూ ఇలా కలవటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

Thirty Five Years for Bala Krishna Ramu Movie : బాలకృష్ణ 'రాము'కు 35 ఏళ్ళు  - NTV Telugu

అలా ఈ నలుగురు కలిసిన ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో దాదాపు 35 సంవత్సరాల క్రితం తీసింది అని తెలుస్తుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, రజ‌ని, శారద, జగ్గయ్య ప్రధాన పాత్రలో వై నాగేశ్వరరావు దర్శకత్వంలో మూవీ మొగల్ రామానాయుడు నిర్మించిన రాము సినిమా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ కి చిరు, కమల్, నాగ్ ముఖ్య అతిథులుగా వచ్చిన సమయంలో తీసిన బ్యూటిఫుల్ ఫోటో ఇది. ఆ సమయంలో కమలహాసన్ సత్య సినిమా చేస్తున్నారు ఆ ఫోటోలో ఆయనను చూస్తుంటే ఆ విషయం అర్థమవుతుంది. అప్పటి అరుదైన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest