రజనీకాంత్ నరసింహ సినిమా వెనుక ఇంత స్టోరీ ఉందా.. అసలు హీరో ఎవరంటే..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహ సినిమా కోలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియా లోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు స్టోరీ అందించింది తెలుగు స్టార్ రైటర్‌ చిన్నకృష్ణ. ఈ సినిమాలో రజనీకాంత్ కు ధీటుగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టింది. రజనీకాంత్ కు జంటగా సౌందర్య నటించింది. ఇందులో రజనీకాంత్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడు.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే ముందుగా ఈ సినిమాలో హీరోగా బాలకృష్ణను అనుకున్నారట. ఈ సినిమాకు కథ అందించిన చిన్ని కృష్ణ అలా అనుకుని డైరెక్టర్ బి గోపాల్ కి చెప్పారట. కానీ అదే సమయంలో బాలయ్యతో బి గోపాల్ సమరసింహారెడ్డి చేస్తున్నాడు. చిన్న కృష్ణ చెప్పిన స్టోరీని తర్వాత చేద్దాం అలా ఉంచండి అని చెప్పి దాన్ని హోల్డ్ లో పెట్టారట. ఇక రైటర్ చిన్న కృష్ణ కూడా అలాగే కొద్ది రోజులు ఈ కథని పక్కన పెట్టారట.

కానీ అంతకుముందే ఈ కథ విన్న చిన్ని కృష్ణ స్నేహితులలో ఒకరు ఈ స్టోరీని దర్శకుడు కేఎస్ రవికుమార్ దగ్గరికి తీసుకువెళ్లారట. దాంతో కె ఎస్ రవికుమార్ ఆ కథ నాకు కావాలని తీసుకుని తన స్నేహితుడైన రజినీకాంత్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు. రజనీకాంత్ ఈ సినిమాలో తన నటనతో అదరగొట్టాడు. కానీ ఒకవేళ ఈ సినిమా బాలయ్య బాబు చేసి ఉంటే మాత్రం రమ్యకృష్ణ పొగరుబోతు క్యారెక్టర్ కి బాలయ్య చెప్పే డైలాగ్స్ మరో లెవల్లో ఉండేది. ఈ విధంగా బాలయ్య ఓ మంచి క్యారెక్టర్ ను తన కెరీర్ లో మిస్ చేసుకున్నాడనే చెప్పాలి.