బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. `షేర్షా` మూవీతో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
జనవరి 12న వీరి వెడ్డింగ్ రిసెప్షన్ ముంబైలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ అతిరథ మహారథులు విచ్చేశారు. అనన్యా పాండే, మనీష్ మల్హోత్రా, విద్యాబాలన్, అజయ్ దేవగణ్, కాజోల్, కరీనా కపూర్, వివెక్ ఓబెరాయ్, ఇషాన్ కట్టర్, అనుపమ్ ఖేర్ తదితరులు నూతన జంటను ఆశీర్వదించారు. అయితే వెడ్డింగ్ రిసెప్షన్ లో కియారా ధరించిన నెక్లెస్ ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రిసెప్షన్ వేడుకలో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్ లో మెరిసిన కియారా.. మెడలో వైట్ అండ్ గ్రీన్ వజ్రాలు పొదిగిన భారీ నెక్లెస్ ను ధరించింది.
ఇది అందరినీ విపరీతంగా ఎట్రాక్ట్ చేసింది. జాంబియన్ గ్రీన్ వరల్డ్ స్టోన్స్ నుంచి తెప్పించి మరి ప్రత్యేకంగా ఈ నెక్లెస్ ను డిజైన్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ నెక్లెస్ట్ లో పొదిగిన ఒక్కొక్క పచ్చ రాయి 3.32 క్యారెట్లు ఉంటుందని, ఇక ఒక్క ఆకుపచ్చ రాయి దాదాపు రూ.29,000 వరకు ఉంటుంది అని చెబుతున్నారు. ఇక నెక్లెస్ మొత్తం ధర తెలిస్తే దిమ్మతిరిగిపోతుందని.. దాని విలువ కొన్ని కోట్లలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది.