బాలయ్య ఎన్టీఆర్‌పై కోపం పెంచుకోవడానికి అదే కారణమా..??

 

నందమూరి తారక రామారావు అంటే తెలియని వారు ఉండరు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంత గొప్ప స్థానంలో ఉంది అంటే దానికి కారణం రామారావుగారి కృషి, పట్టుదల అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక మూడవ తరంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వారిద్దరిలో ఎన్టీఆర్ మాత్రమే స్టార్ట్ హీరోగా ఎదిగాడు. నిజానికి బాలయ్య కంటే కూడా ఎన్టీఆర్‌కే ఎక్కువమంది అభిమానులు ఉన్నారు.

ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఒకే కుటుంబానికి చెందిన ఈ బాబాయ్, కొడుకుల మధ్య ఒక చిన్న కోల్డ్ వార్ నడుస్తుంది. చాలా సార్లు బాలకృష్ణ కావాలని ఎన్టీఆర్ ని అవమానించారు. ఒకానొక సమయంలో బాలయ్య ఇన్‌డైరెక్ట్‌గా ఎన్టీఆర్‌ని తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇక ఈ సమయం లో ఒక సీనియర్ జర్నలిస్ట్ జూ.ఎన్టీఆర్ ని బాలకృష్ణ కావాలని అవమానిస్తున్నాడు. ‘అంటూ రాసుకొచ్చారు.

అసలు విషయంలోకి వెళ్తే, ఎన్టీఆర్ ఒకసారి తన తల్లిని తీసుకొని వాళ్ల ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్లారట. అప్పుడు బాలకృష్ణ వారిద్దరినీ బయటకు వెళ్ళమని చెప్పారట. అవమానం తట్టుకోలేక ఎన్టీఆర్ తన తల్లిని తీసుకొని వెనక్కి తిరిగి వెళ్లిపోయారట. ఆ తరువాత ఎన్టీఆర్ పట్టుదలతో స్టార్ట్ హీరోగా ఎదిగాడు. దాంతో బాలకృష్ణ తన సినిమా ఫంక్షన్ కోసం స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ ని పిలిచి దగ్గరకి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రాజకీయాల వల్ల ఎన్టీఆర్ కి దూరంగా ఉంటున్నాడు బాలయ్య. ఇలా ఏదో ఒక విధంగా ఎన్టీఆర్ ని అవమానించిన దూరం పెట్టడం కరెక్ట్ కాదు అని ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.