ఇంట్రెస్టింగ్ వార్‌.. బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు కోసం ఎన్టీఆర్‌-చ‌ర‌ణ్ పోటాపోటీ!

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రంతో ఇంటర్నేషనల్ వైడ్‌ గా పాపులర్ అయిన టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫైట్ నెలకొంది. బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ఈ ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌త ఏడాది విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను అందుకుంటూ దూసుకుపోతోంది.

ఇప్ప‌టికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను అందుకున్న ఈ చిత్రం తాజాగా అమెరికాకు చెందిన `క్రిటిక్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్‌`లో రెండు కేటగిరీలకు నామినేషన్స్ దక్కించుకుంది. బెస్ట్ యాక్ష‌న్ ఫిల్మ్‌తో పాటు బెస్ట్ యాక్ట‌ర్ కేట‌గిరీల్లో ఈ సినిమా నామినేట్ అయ్యింది. అయితే బెస్ట్ యాక్ట‌ర్ కేట‌గిరీలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఇద్ద‌రు వేర్వేరుగా పోటీలో నిల‌వ‌డం విశేషం.

బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ క్యాటగిరిలో హాలీవుడ్ ప్రఖ్యాత నటులు టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్, నికోలస్ కేజ్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటికి దిగారు. అలాగే బెస్ట్ యాక్షన్ మూవీ విభాగంలో టాప్ గన్: మావెరిక్, బుల్లెట్ ట్రైన్, ది అన్‌బేరబుల్ వెయిట్ ఆఫ్ మాసివ్ టాలెంట్, ది ఉమెన్ కింగ్ తో పాటు ఆర్ఆర్ఆర్ నామినేట్ అయింది. అవార్డుల ఫలితాలు మార్చి 16న విడుదల చేయనున్నారు. మొత్తానికి బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు కోసం ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ఒక‌రితో మ‌రొక‌రు పోటీప‌డ‌బోతుండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

Share post:

Latest