ఆ తేదీ కోసం కొట్టుకుంటున్న చిరంజీవి, ప‌వ‌న్‌.. వెన‌క్కి త‌గ్గేదెవ‌రు..?

ఇటీవల `వాల్తేరు వీరయ్య` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్‌` అనే సినిమా చేస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా మేనల్లుడు సాయి ధరమ్ తేజతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీని స్టార్ట్ చేశాడు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన `వినోదయ సీతం` రీమేక్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సముద్రఖని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. కొద్ది రోజులు క్రితమే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

అయితే ఈ రెండు రీమేక్ చిత్రాల‌ను ఆగస్టు 11న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఆగష్టు 11 వ తేదీన విడుదల చేస్తే వీకెండ్ తో పాటుగా ఆగస్టు 15వ తేదీ పబ్లిక్ హాలిడే కూడా కలిసి వస్తుంది. దాంతో సుల‌భంగా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి రావొచ్చు. ఈ నేప‌థ్యంలోనే అన్న‌ద‌మ్ములిద్ద‌రూ ఆ తేదీ కోసం కొట్టుకుంటున్నార‌ట‌. మ‌రి వీరిద్ద‌రిలో వెన‌క్కి త‌గ్గేదెవ‌రు.. ఆగ‌స్టు 11న థియేట‌ర్స్ లో సంద‌డి చేసేదెవ‌రో చూడాలి.

Share post:

Latest