ఈ చిత్రంలో వున్న ముద్దుగుమ్మను గుర్తు పట్టగలిగితే మీరు నిజంగా సినిమా ప్రేమికులే?

ప్రస్తుతం ఓ ఫోటో సోషల్ మీడియాను కుదిపేస్తోంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆ ఫోటో ఆ హీరోయిన్ తాలూక వర్తమానాన్ని, గతాన్ని ప్రతిబించేలాగా వుంది. కొంతమంది ఆ ఫోటోని చూసి ‘సూపర్ ఫోటోగ్రఫీ’ అని పొగుడుతూ ఉంటే… కొంతమంది ఆ ఫోటోని చూసి ‘ఆమె మరలా విజృంభిస్తుంది’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ సెలిబ్రిటీ ఎవరో మీరు కనిపెట్టారా? అవును. ఆమే సమంత రూత్ ప్రభు.

అమె జీవితం గురించి అందరికీ తెలిసిందే. అమె జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఏ మాయ చేసావే సినిమాతో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను మాయ చేసిన సామ్ అనతికాలంలోనే టాలీవుడ్లో సూపర్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఈ క్రమంలో వివాహం, విడాకుల వరకు అమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. ఇక అవి చాలవన్నట్టు ఓ దారుణమైన రోగంతో అమె తీవ్ర మనస్థాపం చెందింది. కాగా ప్రస్తుతం ఆ బాధలనుండి అమె ప్రస్తుతం మేలుకుంటోంది.

అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా అమె షేర్ చేసిన ఆ ఫోటో దానికి అద్దం పట్టేలాగా కనబడుతోంది. అవును, అమె కొద్ది రోజులుగా మయోసైటిస్ అనే సమస్యతో ఇబ్బందిపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా అమె ప్రస్తుతం శాకుంతలం సినిమా డబ్బింగ్ చెబుతూ.. తన ఆరోగ్య పరిస్థితిని వివరించింది. కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆమె సిటాడెల్ చిత్రీకరణలో పాల్గొంటుంది.

Share post:

Latest