మోసం చేసిన నాని.. గొడ‌వ‌కు దిగిన కీర్తి సురేష్‌.. ఏం జ‌రిగిందంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ను మోసం చేశాడు. దాంతో కీర్తి సురేష్ నానితో గొడవకు దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని, కీర్తి సురేష్ జంట‌గా `దసరా` అనే మూవీ లో నటించిన సంగతి తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు.

ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నాని పూర్తి ర‌ఫ్ లుక్ లో క‌నిపించ‌బోతున్నారు. అలాగే కీర్తి కూడా డీ గ్లామ‌ర్ లుక్ లో అల‌రించ‌బోతోంది. ఇక‌పోతే నిన్న నాని బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కీర్తి సురేష్ త‌న ఇన్‌స్టా ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేసింది.

ఇందులో ఏముందంటే.. ద‌స‌రా షూటింగ్ సెట్స్ లో నాని, కీర్తి షటిల్ ఆడారు. అయితే గేమ్ ఆడుతున్న క్రమంలో పాయింట్స్ విషయంలో నాని మోసం చేశాడు. దాంతో కీర్తి సురేష్ నానితో స‌ర‌దాగా చిన్న పాటి గొడ‌వ‌కు దిగింది. ఈ వీడియో ప్ర‌స్తుతం నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈ సంద‌ర్భంగా `నా ఫ్రెండ్‌, సహ నటుడు, శ్రేయోభిలాషికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మా సంబరాలకు ఇంకా 40 రోజుల కంటే తక్కువ సమయం ఉంది. 2023 ని కుమ్మేసేయ్ ధరణి..` అంటూ కీర్తి సురేష్ త‌న పోస్ట్ కింద నానీని ఉద్దేశిస్తూ రాసుకొచ్చింది.

Share post:

Latest