ప్రపంచం తలకిందులు అయినా సరే.. ఆ వ్యక్తి జబర్ధస్త్ లో అడుగు పెట్టలేడు..ఎందుకంటే..?

బుల్లితెరపై జబర్దస్త్ షోకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ షో ని తలదన్నే రీతిలో టిఆర్పిలు సంపాదించుకోవడానికి పలు చానల్స్ నానా రకాలుగా ట్రై చేస్తున్న సరే జబర్దస్త్ కి సగం కూడా టిఆర్పి రేటింగ్ సంపాదించుకోకపోవడం మనం గమనించాల్సిన విషయం. ఎప్పుడో స్టార్ట్ అయిన జబర్దస్త్ ఇప్పటివరకు టాప్ రేటింగ్స్ అందుకుంటుంది అంతే దానికి మెయిన్ రీజన్ జబర్దస్త్ లో వేసే కామెడీ స్కిట్స్ అనే చెప్పాలి . అఫ్ కోర్స్ కొన్ని వల్గర్ డైలాగ్స్ కొన్ని హద్దులు మీరీనా పంచ్ డైలాగ్స్ ఉంటాయి .

అప్పుడప్పుడు అలాంటి ఘాటు మసాలాలు దట్టించకపోతే జనాలకు ఇంట్రెస్ట్ రాదు. ఆ కారణంగానే జబర్దస్త్ టాప్ రేటింగ్స్ సంపాదించుకుంటుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే జబర్దస్త్ లో ఒకప్పుడు జడ్జ్ గా ఉండి ఆ తర్వాత కొన్ని కారణాల చేత స్కిప్ అయిపోయిన నాగబాబు రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”జబర్దస్త్ టీం తో ..కానీ మేనేజ్మెంట్ తో.. కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని.. జబర్దస్త్ లో పనిచేసే ఆయన తనతో బిహేవ్ చేసిన ఆ పద్ధతి నాకు నచ్చకే నేను బయటకు వచ్చేసాను.. తప్పిస్తే జబర్దస్త్ తో మల్లెమాల ఎంటర్టైన్మెంట్ తో నాకు ఎటువంటి గొడవలు లేవంటూ ఓపెన్ గా చెప్పారు. నా ఇష్టపూర్వకంగానే బయటకు వచ్చాను ..మళ్ళీ నా ఇష్టపూర్వకంగా వెళ్లనని.. వాళ్ళు పిలిస్తే మాత్రం ట్రై చేస్తాను ” అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే జబర్దస్త్ లో పనిచేసే మేనేజర్ కారణంగా బయటకు వెళ్లిపోయిన నాగబాబు మాట్లాడిన మాటలు పై ఆయన పరోక్షకంగా కౌంటర్ వేశారు. ” ప్రపంచం తలకిందులైనా సరే వేరే కమెడియన్స్ ని వేరే జడ్జీలను ని జబర్దస్త్ లోకి రాణిస్తామేమో కానీ.. ఇలా నమ్మించి చీట్ చేసి మోసం చేసిన నాగబాబును మాత్రం జబర్దస్త్ లోకి అడుగుపెట్టనిచ్చేదే లేదు” అంటూ ఘాటుగా కమెడియన్స్ వద్ద చెప్పుకొచ్చారట . ప్రజెంట్ ఇదే కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే పాలిటిక్స్ ని మించిన రేంజ్ లో జబర్దస్త్ లో గొడవలు జరుగుతున్నాయి అన్నది మాత్రం వాస్తవం అంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు..!!

Share post:

Latest