తార‌క‌ర‌త్న అంత్య‌క్రియ‌ల్లో క‌నిపించిన ఈ నంద‌మూరి హీరోను గుర్తు ప‌ట్టారా…!

నందమూరి తారకరత్న మరణంతో నందమూరి- నారా కుటుంబాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులో తీవ్ర విషాదం నెలకుంది. గత శనివారం ఫిబ్రవరి 18న తారకరత్న మరణించగా.. సోమవారం నాడు వేలాదిమంది అభిమానుల సమక్షంలో తారకరత్న అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులలో పాటు స్నేహితులు, బంధువులు, సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తారకరత్న బాబాయ్, ఒకప్పటి నందమూరి హీరో కళ్యాణ్‌ చక్రవర్తి కూడా పాల్గొన్నారు. ఈయన స్వర్గీయ నటరత్న ఎన్టీఆర్ తమ్ముడు, త్రివిక్రమరావు పెద్దకొడుకే ఈయన.. కళ్యాణ్ చక్రవర్తి 1986 నుంచి 1994 వరకు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. ‘అత్తగారు స్వాగతం’, ‘అత్తగారు జిందాబాద్’, ‘మామా కోడళ్ల సవాల్’, ‘ఇంటిదొంగ’, ‘అక్షింతలు’, ‘కృష్ణ లీల, ’ రౌడీ బాబాయ్’, ‘దొంగ కాపురం’, ‘లంకేశ్వరుడు’, ‘తలంబ్రాలు’, ‘ప్రేమ కిరీటం’, ‘జీవన గంగ’ వంటి పలు సినిమాల్లో నటించారు.. కేవలం హీరోగానే కాకుండా.. కీలక పాత్రల్లోనూ కనిపించారు.

ఒకప్పటి హీరో కళ్యాణ్ చక్రవర్తి బాలకృష్ణ కు ఏమవుతారో మీకు తెలుసా.?! »  Telugudesk

మరి ప్రధానంగా కళ్యాణ్ చక్రవర్తి మాస్ హీరోగా ఎదగాలని ప్రయత్నించి.. ఆ తరహా సినిమాలు చేశారు కానీ అవి ఆయనకు వర్కౌట్ కాలేదు. మంచి హైట్ పర్సనాలిటీ, హీరోగా ఎదిగే అవకాశం ఉన్న సరైన అవకాశాలు రాకపోవటంతో..నందమూరి కుటుంబం నుంచి సపోర్టు ఉన్న కానీ ఆయన కెరీర్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు ఆయన.. ఇతర వ్యాపారాలు చూసుకుంటూ చెన్నైలోనే స్థిరపడ్డాడు కళ్యాణ్ చక్రవర్తి.

ఇప్పుడు చాలాకాలం తర్వాత తారకరత్న మరణంతో హైదరాబాద్‌కు వచ్చారు. తారకరత్న ఇంటి వద్ద కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ లను క‌ళ్యాణ్ చక్రవర్తి పలకరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఎంతో కాలం తర్వాత ఈ నందమూరి హీరో కనిపించడంతో నందమూరి అభిమానులే గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు అంటూ కామెంట్లో చేస్తున్నారు.

Share post:

Latest