గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్- చిరంజీవి కలిసి పలు సినిమాల్లో నటించారు. చిరు- రజనీ సినిమాలను చాలానే రీమేక్ చేశాడు. భాషా సినిమా వరకు ఈ ఇద్దరు ఒకే రేంజ్ స్టార్ స్టేటస్ తో ఉండేవాళ్లు కానీ భాష సినిమా తర్వాత రజనీకాంత్ పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. ప్రధానంగా ఆయనకు తెలుగులో మన స్టార్ హీరోలకు సమానంగా తన రేంజ్‌ను పెంచుకున్నాడు. ఇక ఓవర్సీస్ లో కూడా ఆయన మార్కెట్ ఒకటికి పదింతలు పెరిగింది, ఇక అప్పటినుంచి తిరుగులేని సూపర్ స్టార్ గా నిలిచాడు.

అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని ముందుగా చిరంజీవి చేయాల్సిందట, కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. తాజాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే చిరంజీవి చేయాల్సిన మరో సినిమా రజనీకాంత్ చేతుల్లోకి వెళ్లి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక మరి ఆ సినిమా ఏమిటంటే తమిళ్ దర్శకుడు పి వాసు తెరకెక్కించున చంద్రముఖి ఆట. ఈ సినిమా సౌత్ అన్ని భాషల్లో విడుదలై సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమాని మలయాళంలో స్టార్ హీరోగా ఉన్న సురేష్ గోపి హీరో గా ఆరోజుల్లో మణిచిత్ర తాల్ సినిమాగా వచ్చింది. ఈ సినిమాలో శోభన హీరోయిన్‌గా నటించింది. 1993 విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత ఈ సినిమాని కన్నడలో ఆప్తమిత్ర అనే పేరుతో విష్ణువర్ధన్ హీరోగా రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. అక్కడ ఆ సినిమాలో సౌందర్య హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య చిరంజీవితో చేయాలని ప్లాన్ చేశారు.
చిరంజీవికి ఆ సినిమా స్టోరీ చెప్పగా ఆ స్టోరీ విన్న చిరు ఎందుకో తన ఇమేజ్‌కు సూట్ కాదని రిజక్ట్ చేశాడు. దాంతో ఈ రీమేక్ రైట్స్ ని తమిళ హీరో ప్రభు సొంతం చేసుకుని రజనీకాంత్ ని హీరోగా పెట్టి పి వాసు దర్శకత్వంలో చంద్రముఖి సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలై ఎలాంటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ విధంగా చిరంజీవి తన చేతులారా ఇలాంటి భారీ బ్లాక్ బస్టర్‌ను మిస్ చేసుకున్నాడు