ప్రభాస్ అభిమానులారా.. ‘ప్రాజెక్ట్‌-కె’ మూవీపై ఆ అనుమానాలు వద్దు..

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. తన సినీ కెరీర్‌లో అలాంటి అద్భుతమైన గ్రాఫిక్స్, భారీ బడ్జెట్‌తో రానున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె ‘ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్, అశ్విన్ దత్ నిర్మాణంలో రూ.500 కోట్ల బడ్జెట్‌తో చిత్రీకరిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ దీపికా పదుకొణే, అమితాబ్‌ బచ్చన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవలే ప్రాజెక్ట్ కె సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్ర బృందం.

వచ్చే ఏడాది జనవరి 12న ప్రాజెక్ట్ కె సినిమా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలలో కూడా నటిస్తున్నాడు. కావున ప్రాజెక్ట్ కె షూటింగ్ అనుకున్న టైమ్‌కి పూర్తవుతుందా, సంక్రాంతికే రిలీజ్ అవుతుందా అనేది సందేహాత్మకంగా మారింది. అయితే ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా రిలీజ్‌పై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని ఆ సినిమా నిర్మాత అశ్విన్ దత్ చెప్తున్నారు. ఇటీవలే ఆయన ఈ సినిమా షూటింగ్ గురించి అందరికీ ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రాజెక్ట్ కె షూటింగ్ 70% పూర్తయిందని వెల్లడించారు. మిగతా 30 % షూటింగ్‌కి ఇంకా 10 నెలలు సమయం ఉంది కాబట్టి అనుకున్న సమయానికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

2017 నుంచి ప్రభాస్ నుంచి రెండంటే రెండే సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. అంటే దాదాపు ఆరేళ్లుగా అభిమానులు నిరాశలోనే మునిగి తేలుతున్నారు. ఈ సమయంలో బాగా హైప్‌ ఉన్న ‘ప్రాజెక్ట్ కె’ లేట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. కాగా అలాంటివేవీ జరగని నిర్మాత చెప్పడంతో ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి.

Share post:

Latest