కీర్తి సురేష్ ఆ కమిట్మెంట్‌తోనే ఇంత దారుణంగా దిగ‌జారిపోయిందా…!

చిత్ర పరిశ్రమకు అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది అందాల భామ కీర్తి సురేష్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మహానటి సినిమాతో కీర్తి సురేష్ తన నటనతో ఆకట్టుకునీ ఒక రాత్రిలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు కీర్తి సురేష్ ఎలాంటి పొజిషన్‌లో ఉందో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుందో చూస్తూనే ఉన్నం. ఒకానొక సమయంలో ఈ అమ్మడి కాల్ షీట్స్ కోసం డైరెక్టర్లు ఎదురుచూసేవాళ్ళు.

Happy Birthday Keerthy Suresh: These Instagram Photos of the South Actress  Will Leave You Spellbound

అయితే ఇప్పుడు మాత్రం దర్శకులు ఎప్పుడెప్పుడు అవకాశాలు ఇస్తారా అంటూ కీర్తి సురేష్ ఎదురుచూస్తూ కూర్చుంటుంది. ఇలాంటి సిచువేషన్ కీర్తి సురేష్ తన చేతులారా క్రియేట్ చేసుకుంది. మహానటి సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో ఆఫర్లు వచ్చిన వాటిని తన చేతులారా వదులుకొని.. తెలిసీ తెలియని ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటూ తప్పుడు దారిలో నడిచింది.

ఈ నేపథ్యంలోనే ఆమె ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఘోరమైన పరాజయాలు చవి చూశాయి.ఇక ఫైనల్ గా మహేష్ బాబుకు జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమాతో విజయం అందుకుంది. ఆ సినిమా దగ్గరనుంచి ఇప్పటివరకు తెలుగులో ఒక సినిమాకు కూడా ఈమె కమిట్ అవలేదు. గతంలో ఎప్పుడూ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు నటిస్తున్న భోళా శంకర్ మ‌రియు నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాల్లో కూడా హీరోయిన్‌గా నటిస్తుంది.

Keerthy Suresh Hot Photos! – Update News 360 | Tamil News Online | Live  News | Breaking News Online - time.news - Time News

ఈ రెండు సినిమాలతోనే ఈమె ఇప్పుడు ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటిదాకా మరో సినిమా ఒప్పుకోక పోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే కీర్తి పెట్టుకున్న ఓ కమిట్మెంట్ కారణమని టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. స్టార్ హీరోల సినిమాల్లో తప్పించి చిన్న హీరోల సినిమాల్లో తాను నటించనని అంటూ ఆమె తాగేసి చెప్పడంతో చిన్నచిన్న అవకాశాలు కూడా చేజారిపోతున్నాయి అంటూ ఆమె సన్నిహితులు అంటున్నారు.

ఇదేవిధంగా కీర్తి సురేష్ ఉంటే మాత్రం రానున్న రోజుల్లో ఆమె పేరు కనుమరుగు అయిపోయిన ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఇప్పటికైనా కీర్తి సురేష్ మేల్కుంటే బాగుంటుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో కీర్తి సురేష్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి.

Share post:

Latest