చిరంజీవి కోసం ఇద్ద‌రు స్టార్ హీరోయిన్ల కోల్డ్‌వార్‌… మాట‌లు కూడా ల్లేవ్‌…!

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత తన నటనతో తన డాన్సులతో కొత్త పుంతలు తొక్కించిన హీరో మెగాస్టార్ చిరంజీవి. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్లో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. మద్య‌లో పది సంవత్సరాలు సినిమాలకు దూరమైన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసుకుంటూ నేటితరం హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి కోసం గతంలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు గొడవ పెట్టుకున్నారట.

చిరంజీవి కోసం గొడవ పెట్టుకున్నా ఆ హీరోయిన్లున్ ఎవరో ఇప్పుడు చూద్దాం. చిరంజీవితో గతంలో ఎంతో మంది హీరోయిన్లు పదులకొద్దీ సినిమాల్లో నటించి అలరించారు. అందులో విజయశాంతి, రాధ కూడా ఒకరు. చిరంజీవి ఈ ఇద్దరు హీరోయిన్లతో చిరంజీవి న‌టించి సూప‌ర్ హిట్స్ కోట్టారు. అప్పట్లో మాస్ జనాలకి చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ అంటే పడి చచ్చేవారు. అంతేకాదు చిరంజీవి, రాధా కాంబినేషన్ సినిమాలను కూడా అంతే ఎంజాయ్ చేసేవారు.

అప్పటి తరం హీరోయిన్లు విజయశాంతి, రాధ మధ్య.. కోల్డ్ వార్ గురించి మీకు తెలుసా  | vijaya shanthi and radha cold war , Vijayashanti, Radha, Chiranjeevi,  Tollywood - Telugu Chiranjeevi, Radha ...

అయితే చిరంజీవితో సినిమాలు తీయాలి అనుకునే దర్శక నిర్మాతలు మాత్రం ఆ సమయంలో స్టార్ హీరోయిన్స్ గా ఉన్న విజయశాంతి, రాధ ఈ ఇద్దరిలో ఎవరు ఖాళీగా ఉంటే వారిని తీసుకుని చిరంజీవితో సినిమా తీసేవారట. ఇదే సమయంలో విజయశాంతి, రాధా మధ్య ఈ విషయంపై అప్పట్లో కోల్డ్ వార్ జరిగేదట. మరి ప్రధానంగా చిరంజీవి సినిమాల విషయంలో విజయశాంతి, రాధ మధ్య మాట మంచి కూడా ఉండేది కాదట.

Kondaveeti Raja (1986) - Photo Gallery - IMDb

విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు హీరోయిన్లు చిరంజీవితో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. ఇక కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ విజయశాంతి లేడి ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిపోయి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది.ఇక రాధా తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. ఈ విధంగా ఆ రోజుల్లో విజయశాంతి, రాధా మధ్య జరిగిన కోల్డ్ వార్ తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎంతో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

Share post:

Latest