బిగ్ బ్రేకింగ్: మరోసారి ఎన్టీఆర్ 30 లాంచ్ ఈవెంట్ వాయిదా..!

స్టార్ట్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను అనౌన్స్ చేసి దాదాపు సంవత్సరకాలం కావస్తుంది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో, అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఈనెల 24వ తేదీన జరగాల్సి ఉండగా.. ఇక ఈ శనివారం నాడు నందమూరి తారకరత్న హఠాన్మరణం చెందడంతో ఈ సినిమా యూనిట్ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయబోతున్నారని తెలుస్తుంది.

ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన‌ తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. మరో తాజా అప్డేట్ ఏమిటంటే సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest