మంచి మనసును చాటుకున్న బాలకృష్ణ.. అసిస్టెంట్ డైరెక్టర్‌కి భారీగా నగదు సాయం!

టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాలయ్య ఒకవైపు సినిమాలతో ఇంకో వైపు రాజకీయాల్లో బాగా బిజీగా ఉన్నారు. బాలయ్య సినిమాలోనే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతో మందికి సహాయం చేసారు. మరీ ముఖ్యంగా కాన్సర్ వ్యాధితో బాధపడేవారికి ఆయన సొంత డబ్బుతో చికిత్స చేయిస్తుంటారు.

బాలకృష్ణ తల్లి కాన్సర్ వ్యాధితో మరణించారు. ఆయన తల్లిలా మరెవరికి జరగకూడదు అనే ఉందేశ్యం తో బసవతారకం అనే హాస్పిటల్ ప్రారంభించి కాన్సర్ రోగులకు మంచి చికిత్స ను అందిస్తూ, పేద ప్రజలకు తన సొంత ఖర్చుతో వైద్యం చేయిస్తుంటారు బాలయ్య. తాజాగా టాలీవుడ్ లోని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసి బాలకృష్ణ అతనికి బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం అందించి అతని ప్రాణాలు కాపాడారు.

ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న మహేష్ యాదవ్ అనే వ్యక్తి కి బ్రెయిన్ ట్యూమర్ చికిత్స కోసం 40 లక్షలు ఖర్చు అవుతాయాని వైద్యులు చెప్పారు. ఇక ఈ విషయాన్ని బోయపాటి శ్రీను ద్వారా తెలుసుకున్న బాలయ్య తన సొంత ఖర్చుతో మహేష్ కి ఇండో అమెరికన్ హాస్పిటల్ లో చేర్పించి ఆపరేషన్ చేయించాడు. అయితే ఈ విషయం ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. ఇక విషయం తెలిసిన బాలయ్య అభిమానులు మా బాలయ్యది అంత మంచి మనస్సు అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.