నందమూరి ఫ్యామిలీకి మ‌రో గండం…ఆ హెచ్చ‌రిక‌కు సంకేతం ఏంటి…!

పుట్టెడు శోకంలో ఉన్న వేళ.. నందమూరి బాలకృష్ణకు అనూహ్య పరిణామం ఎదురైంది. అయితే.. ఈ ఘటన చోటు చేసుకున్న స‌మ‌యంలో అదీ బాలయ్య చూస్తుండిపోయారే తప్పించి.. అస్సలు ఏమీ స్పందించకపోవటం ఆశ్చర్యానికి గురి చేసింది. తారకరత్న అకాల మరణంతో ఇప్ప‌టికే తీవ్ర విషాదంలోకి ఉంది నందమూరి కుటుంబం. తారకరత్నకు అంత్యక్రియలకు ముందు ఫిలింఛాంబర్ లో అభిమానుల సందర్శన కోసం ఆయన భౌతికకాయాన్ని ఉంచటం తెలిసిందే.

ఇక అక్క‌డ‌కు సిని, రాజ‌కీయా వ‌ర్గాల‌కు చెందిన వారు తార‌క‌ర‌త్నా భౌతిక‌కాయ‌న్నికి నివాళులు అర్పించారు. నందమూరి బాలకృష్ణతో పాటు.. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి మామయ్య వరుసైన విజయసాయి రెడ్డి కూడా ఫిలింఛాంబర్ లో ఉండి అక్కడి ఏర్పాట్లను చూసుకోవటం..పెద్ద దిక్కుగా వ్యవహరించటం మ‌నం చూశాం.

అక్కడ‌ అదే స‌మ‌యాంలో తారకరత్న భౌతిక కాయానికి ఒక మతిస్థిమితం లేని వ్యక్తి నివాళులు అర్పించిన‌ వెంటనే బాలకృష్ణ దగ్గరికి వచ్చి పెద్ద పెద్దగా మాట్లాడుతూ జాగ్రత్త బాలయ్య అంటూ బాలకృష్ణను హెచ్చరించారు. బాల‌కృష్ణ త‌న స్వ‌భావ‌నికి భిన్నంగా ఈసారి అ వ్య‌క్తి చెప్ప‌టానికి ప్ర‌య‌త్నించ‌న విష‌యాల‌ను ఎంతో శ్రద్ధగా వింటూ.. అతన్ని చూస్తూ ఉండిపోయారు.

Balakrishna: బాలకృష్ణను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన మతిస్థిమితం లేని  వ్యక్తి.. ఏమైనా ప్రమాదం జరగబోతోందా..? - PakkaFilmy

ఆ వెంటనే స్పందించిన పోలీస్‌ అధికారులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇక ఆ వ్య‌క్తి బాలయ్యకు చాలా దగ్గరగా వచ్చి.. సూటిగా బాలయ్య ముఖం మీదకు వేలు చూపిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించటం ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. మళ్లీ నందమూరి ఫ్యామిలీలో ఏం జ‌ర‌గ‌బోతోంది… ఆ మతిస్థిమితం లేని వ్యక్తి హెచ్చరించిన మాటల వెనుక అర్థం ఏంటి.. అంటూ చాలామంది నందమూరి అభిమానులు భయపడుతున్నారు.

Share post:

Latest