హైపర్ ఆది పరువు తీసేసిన యాంకర్.. అయ్యో పాపం..

బుల్లితెరపై స్టార్లు ఎవరు అనగానే ఖచ్చితంగా మనకు జబర్దస్త్ స్టార్లు గుర్తొస్తారు. ఎందుకంటే వారు చేసే స్కిట్లలో హాస్యం, పంచులు అందరినీ నవ్విస్తాయి. బుల్లితెర నుంచి వెండితెరపై హీరోగా సుధీర్ వెలుగొందుతున్నాడు. అతడి తర్వాత ఆ స్థాయిలో హైపర్ ఆది బుల్లితెరను ఏలుతున్నాడు. ముఖ్యంగా స్కిట్లలో సందర్భానుసారంగా అతడు వేసే పంచ్‌లకు నవ్వని ప్రేక్షకులు ఉండరు. తోటి నటులపైనా, యాంకర్లపైనా అతడు జోక్స్ వేసి నవ్విస్తాడు. అతడు వేసే పంచ్‌లకు అనసూయ, రష్మి వంటి వారు ఇబ్బంది పడినా టీఆర్‌పీ రేటింగ్స్ బాగా వస్తున్నాయి. దీంతో ఈ తరహా స్కిట్లకు ప్రాధాన్యం పెరిగింది. ఇలాంటి నటుడైన ఆదికి ప్రస్తుతం కోలుకోలేని షాక్‌ను ఓ యాంకర్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

జబర్దస్త్‌కు యాంకర్‌గా సౌమ్య వచ్చింది. వచ్చీరాని స్థాయిలో ఆమె మాట్లాడే తెలుగుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఆమెపై హైపర్ ఆది చాలా పంచ్‌లు వేస్తున్నాడు. అయితే సౌమ్య కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చేస్తోంది. తాను చిరంజీవి ఫ్యాన్ అని గతంలో హైపర్ ఆది అనగా, చిరంజీవి కాదు కదా అని సౌమ్య గాలి తీసేసింది. ఇదే కోవలో ఈటీవీలో హోలీ పండగ సందర్భంగా గుండెజారి గల్లంతయ్యిందే అనే ప్రత్యేక ప్రోగ్రామ్ ప్రసారం చేయనున్నారు.

దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులో హైపర్ ఆది పరువును నిలువునా సౌమ్య తీసేసింది. యాక్టింగ్, కామెడీ చేయడం రాదని, కనీసం బైక్ నడపడం కూడా రాదా అంటూ హైపర్ ఆదిని సౌమ్య అడిగింది. దీనికి సెట్లో ఉన్నవారంతా నవ్వేశారు. ఈ వీడియో మార్చి 5న ప్రసారం కానుంది. దీని కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Share post:

Latest