“అలా చేస్తేనే మళ్ళీ జబర్ధస్త్ లోకి అడుగుపెడత”..అనసూయ కండీషన్ కి జనాల మైండ్ బ్లాక్..!!

టాలీవుడ్ జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ .. జబర్దస్త్ షో నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే . సినిమా ఇండస్ట్రీలో పలు రోల్స్ చేస్తూతనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ .. జబర్దస్త్ లో కూడా యాంకర్ గా చేస్తూ వచ్చింది. అయితే జబర్దస్త్ లో వల్గారిటీ ఎక్కువగా ఉందని.. బాడీ షేమింగ్ కామెంట్స్ ఎక్కువగా చేస్తున్నారని.. ఈ కారణంగానే తన బిడ్డలు రేపు పెద్దయ్యాక ఆ విషయాన్ని పై బాధపడకూడదని ఆ షో నుంచి తప్పుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన అనసూయ.. రీసెంట్గా మరోసారి జబర్దస్త్ షోపై సంచలన కామెంట్స్ చేసింది .

ఈ క్రమంలోనే అభిమానులతో సోషల్ మీడియా ద్వారా చిట్ చాట్ చేసిన అనసూయకు ఓ నెటిజన్ నుంచి వింత ప్రశ్న ఎదురయింది . “మళ్లీ టీవీ షోస్ ఎప్పుడు చేస్తారు.. మిమ్మల్ని బుల్లితెరపై చూడాలని ఉందని” ప్రశ్నించాడు . ఈ క్రమంలోనే అనసూయ బుల్లితెరపై టిఆర్పి స్టంట్లను బయటపెట్టింది. ” విపరీతమైన .. అగౌరవకరమైన టిఆర్పి స్టంట్స్ పోయినప్పుడు ఖచ్చితంగా టీవీ షోస్ లో అడుగు పెడతానని” చెప్పకనే చెప్పేసింది అనసూయ.

అంటే.. టిఆర్పి ల కోసం చేసే చెత్త స్టాండ్స్ పోతేనే జబర్దస్త్ లో అడుగు పెడతానని ..అలాంటి షోస్ లో మళ్ళీ ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచిస్తానని ..జబర్దస్త్ మేనేజ్మెంట్ కి చెప్పకనే చెప్పేసింది అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు. సో.. జబర్దస్త్ లో అగౌరవపరిచే డబల్ మీనింగ్ డైలాగులు .. పంచులు మానేస్తేనే అనసూయ జబర్దస్త్ షోలోకి అడుగుపెడుతుందట . చూద్దాం మరి అనసూయ కోసం మల్లెమాల .. జబర్దస్త్ టీం వల్గర్ పంచెస్.. డబల్ మీనింగ్ డైలాగ్స్ ను ఆపేస్తారో.. లేక అనసూయ కి లైఫ్ టైం ఎక్సిట్ పాజ్ ఇచ్చేస్తారో..ప్రెసెంట్ అనసూయ పలు బడా ప్రాజెక్ట్స్ లో భాగమై కెరియర్ను బిజీగా ముందుకు తీసుకెళ్తుంది..!!

Share post:

Latest