“ఆ విషయంలో తప్పు నాదే”..ఇన్నాళ్ళకి నిజం ఒప్పేసుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయలోకం ..ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడు.. ఎవరి టైం.. ఎలా మారిపోతుందో.. ఎవరికీ తెలియదు . స్టార్ గా ఉన్న హీరో జీరోగా మారడం.. జీరో గా ఉన్న హీరో స్టార్ గా మారడం క్షణాల్లోనే జరిగిపోతుంది. రాత్రికి రాత్రి ఇండస్ట్రిలో లెక్కలు తారుమారైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరోసారి అలాంటి మాయలకే బలైపోయాడు బాలీవుడ్ బడా హీరో అక్షయ్ కుమార్. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ బడా హీరో అక్షయ్ కుమార్.. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనందరికీ తెలిసిందే.

ఆయన లాస్ట్ గా నటించిన 16 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి. ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయన నటించి రిలీజ్ అయిన సెల్ఫీ చిత్రం అభిమానులను నిరాశ పరచడం పట్ల సంచలన కామెంట్స్ చేశారు అక్షయ్ కుమార్. రీసెంట్గా బాలీవుడ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..” ఇటీవల నా సినిమాల విషయంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాను ..నేను నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఇది కొంచెం బాధాకర విషయం .

కానీ నా కంటెంట్ జనాలకి నచ్చట్లేదు . వాళ్లకు నచ్చే విధంగా నేను సినిమాలు తీయలేక పోతున్నాను. కచ్చితంగా నాలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది . ప్రజలు ఇప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు . వ్యాపారంలో ఎప్పుడు లాభాలు రాకపోవచ్చు.. అలాగే సినిమా విషయంలో కూడా ఎప్పుడు సక్సెస్ సాధించలేకపోవచ్చు ..కానీ ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది ..అలాగే నా సినిమా హిట్ అవుతుంది అంటూ ఆశగా ఉన్నాను.. ఈ విషయంలో అభిమానులు నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను ” అంటూ ఎమోషనల్ గా స్పందించారు.

కాగా అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో పోషించిన సెల్ఫీ మూవీ ఫిబ్రవరి 24న విడుదలై బాక్సాఫీస్ లో వన్ ఆఫ్ ది డిజాస్టర్ మూవీ గా మారింది. ఈ క్రమంలోనే కొందరు అక్షయ్ మాటలను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికైనా నీకు అర్థమైందా..? ఇక సినిమాలు ఆపెయి రా బాబు. నీకు దండం పెడతామంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

 

Share post:

Latest