నటి సిమ్రాన్ ఇప్పుడెలా ఉందో చూశారా.. గుర్తుపట్టడం కాస్త కష్టమే!

సిమ్రాన్ అంటే తెలియని సినీప్రియలు ఉండరు. పంజాబీ కుటుంబంలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. ఓ బాలీవుడ్ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించింది. మలయాళ చిత్రంతో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సిమ్రాన్ తొలి చిత్రం `అమ్మాయి గారి పెళ్లి`. సమరసింహారెడ్డి సినిమాతో తెలుగులో స్టార్ హోదాను అందుకుంది.

ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు తెలుగులో బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ ఆగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అలాగే మరోవైపు కోలీవుడ్ బాలీవుడ్ ను కూడా ఓ ఊపు ఊపేసింది. కెరీర్ పీక్స్ లో ఉన‌ప్పుడు దీపక్ బగ్గతో 2003లో ఏడ‌డుగులు వేసింది. ఇతను ఒక పైలట్. ఈ దంపుతుల‌కు ఇద్ద‌రు కుమారులు జ‌న్మించారు.

కొన్నాళ్లు వెండితెర‌కు దూర‌మైన సిమ్రాన్‌.. 2019లో `పేట‌` మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత అడ‌పా త‌డ‌పా సినిమాల్లో స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోసిస్తున్న సిమ్రాన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..? తాజా ఫోటోల్లో సిమ్రాన్ ను గుర్తు ప‌ట్ట‌డం కాస్త క‌స్ట‌మే అవుతుంది. ప్ర‌స్తుతం సిమ్రాన్ ఏజ్ 46. వ‌య‌సు పైబ‌డ‌టంతో ఆమె ముఖంతో వృద్ధాప్య ల‌క్ష‌ణాలు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. పైగా పేక‌ప్ లేక‌పోవ‌డం వ‌ల్ల సిమ్రాన్ లేటెస్ట్ పిక్స్ చూసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు.

Share post:

Latest