నందమూరి అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్.. బాబాయ్ తో అబ్బాయి ఫిక్స్‌..!

నటసింహం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కరోనా తర్వాత అఖండతో తన దండయాత్ర మొదలుపెట్టిన బాలకృష్ణణ. ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో తన విజయ పరంపరను మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. ఇక బాలకృష్ణ ఇటు సినిమాలతో మరోవైపు బుల్లితెరపై కూడా తన హవా చూపిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్న సెన్సేషనల్ దర్శకుడు అనిల్ రావిపూడి తో తన 108వ సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా కూడా బాలయ్య పాత సినిమాలకు భిన్నంగా ఎంతో కొత్తగా ఉండబోతుంది. ఈ సినిమా స్టోరీ కూడా ఎంతో న్యూ లుక్ లో ఉండబోతుందని టాక్. ఇప్పటికే ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో డైలాగులు అదరగొట్టబోతున్నాడు అంటూ దర్శకుడు అనిల్ వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో ప్రకటించాడు. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎవరు అనే దానిపై ఇంకా స్వష్టత రాలేదు. ఇక గతంలో ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ని ఎంపిక చేసినట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ గా మారింది.

NBK 108: 'ఎన్‌బీకే 108' అప్‌డేట్స్ రిలీజ్ చేస్తున్నార‌ట‌!.. పండుగ అంటున్న  బాల‌కృష్ణ (Balakrishna) ఫ్యాన్స్

అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఎక్సైటింగ్ వార్త వైరల్ గా మారింది. గత కొద్దిరోజులుగా నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. నందమూరి మోహనకృష్ణ తనయుడు నటుడు తారకరత్న అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఒకీలక విషయం బయటకు వచ్చింది. ఆ వార్త ఏమిటంటే ఇక తారకరత్నను ఈ సినిమాలో విలన్ గా నటింపజేయాలని బాబాయ్ బాలకృష్ణ భావించారట. ఈ మేరకు ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తుంది.

తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ వివరణ.. ఫోన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్! |  Nandamuri balakrishna clarifications on nandamuri taraka ratna health -  Telugu Filmibeat

కొద్దిరోజులుగా తారకరత్న సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించడానికి కూడా ఇదే కారణం అని తెలుస్తుంది. ఈ లుక్ లోనే బాబాయ్ బాలయ్య సినిమాలో విలన్ క్యారెక్టర్ లో నటించడానికి సిద్ధమయ్యాడని.. అంతలోనే తారకరత్నకు హార్ట్ ఎటాక్ రావటం జరిగింది. ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్లో చికిత్ప‌ పొందుతున్నాడు. తారకరత్న ఆరోగ్య విషయంలో బాలకృష్ణ అన్నీ తానై వ్యవహరించిన విషయం తెలిసిందే. ప్రాణాపాయం లేదని తెలుసుకున్న తర్వాతే బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చారు బాలయ్య.
అన్నీ అనుకున్నట్టు జరిగితే బాబాయ్ తో అబ్బాయి విల‌న్ ఇజం ఎలా ఉండేదో చూసే వాళ్ళం.

Share post:

Latest