`వాల్తేరు వీర‌య్య‌` ప్రీ రిలీజ్‌ బిజినెస్.. చిరు ముంగిట భారీ టార్గెట్‌!

ఆచార్య‌, గాడ్ ఫాద‌ర్ వంటి ఫ్లాపుల అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న తాజా చిత్రం `వాల్తేరు వీర‌య్య‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషించాడు.

శృతి హాస‌న్‌, కేథ‌రిన్ ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. విశాఖపట్టణం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై ఎన్నో అంచ‌నాలు నెల‌కొన‌డంతో.. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జ‌రిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 72 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రానికి.. వరల్డ్ వైడ్ గా రూ. 88 కోట్ల రేంజ్ లో బిజినెస్ జ‌రిగింది. ఇక ఏరియాల వారీగా వాల్తేరు వీర‌య్య టోట‌ల్ బిజినెస్ లెక్క‌ల‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 18 కోట్లు
సీడెడ్: 15 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 10.2 కోట్లు
తూర్పు: 6.50 కోట్లు
పశ్చిమ: 6 కోట్లు
గుంటూరు: 7.50 కోట్లు
కృష్ణ: 5.6 కోట్లు
నెల్లూరు: 3.2 కోట్లు
———————————
ఏపీ+తెలంగాణ = 72.00 కోట్లు
———————————

క‌ర్ణాట‌క‌: 5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 2.00 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 9 కోట్లు
—————————–
వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్‌ = 88 కోట్లు
—————————–

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 88 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. చిరంజీవి ముగింట రూ. 89 కోట్ల టార్గెట్ ను ఉంచింది. మ‌రి ఈ టార్గెట్ ను చిరు అందుకుంటాడా.. లేదా.. అన్న‌ది చూడాలి.