ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ జనసేన అధినేత నటుడు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే .ఇక మెగా బ్రదర్ నాగబాబుపై తాజాగా మళ్లీ సెటైర్లు వేసినట్లుగా తెలుస్తోంది.తన ట్విట్టర్ నుంచి ఒక వీడియోను కూడా విడుదల చేశారు రాంగోపాల్ వర్మ. ఆ వీడియోలో రాంగోపాల్ వర్మ కొణిదెల నాగబాబు గారు అంటూ ఆయన పైన మాటలతుటాలు కురిపించారు. ఆయన అన్నయ్య చిరంజీవి ,తమ్ముడు పవన్ కళ్యాణ్ కు నాగబాబు ప్రియమైన వ్యక్తి కావచ్చు కానీ తనకి కాదని ఈ వీడియోలో తెలియజేశారు.
తాను జనసేన పార్టీ మీద కానీ పవన్ కళ్యాణ్ మీద గాని పెట్టిన ట్విట్ట్లు ఒక అభిమానిగా చేసినవే తప్ప మరే ఉద్దేశంతో కాదని తెలియజేశారు.అయితే వారికి అర్థం కాకపోవడం తన దురదృష్టమని తనకంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ దురదృష్టకరమని రాంగోపాల్ వర్మ తెలియజేశారు. నాగబాబు లాంటి సలహాదారులను మాత్రమే పెట్టుకుంటే దాని ఫలితాన్ని ప్రజలే చెబుతారని తెలియజేశారు వర్మ. ఇక క్యాప్షన్ కి హలో పవన్ కళ్యాణ్ గారు మీ భాయిజాన్ గారిని చూసుకోండి అని తన వీడియోకు క్యాప్షన్ ఇవ్వడం జరిగింది.
గత కొన్ని రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ లపై తనదైన స్టైల్ లో విమర్శలు కురిపిస్తున్నారు వర్మ. ముఖ్యంగా యువశక్తి సభలో పవన్ ప్రసంగం పైన కూడా సెటైర్లు వేశారు. సంక్రాంతి సందర్భంగా రాంగోపాల్ వర్మ గోదావరి జిల్లాలో పర్యటించారు.నిన్నటి రోజున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కలుసుకొని రాజకీయ వ్యవహారం పై స్పందించినట్లు సమాచారం. అయితే వర్మ మాత్రం కేవలం తన స్నేహితులు పిలిచారని కారణంగానే పండుగను చూడడానికి వచ్చానని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
Hello @Pawankalyan gaaru , Konchem mee bhaijaaan gaarini choosukondi pic.twitter.com/8ih8kgxlDC
— Ram Gopal Varma (@RGVzoomin) January 15, 2023