బాల‌య్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌.. వ‌చ్చేది మాస్ మొగుడు కాదు.. `వీర సింహ రెడ్డి` ట్రైలర్..!

నరసింహ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, హ‌నీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలకపాత్రలను పోషించారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందించాడు సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్‌ అప్డేట్ తో సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన జై బాలయ్య, సుగుణసుందరి, మా బావ మనోభావాలు సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇటీవ‌ల `మాస్‌ మొగుడు` అంటూ సాగే మరో పాటను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ వచ్చేది మాస్ మొగుడు కాదు వీర సింహారెడ్డి ట్రైలర్. అవును, తాజాగా మాస్ మొగుడు సాంగ్ ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే ఆ సాంగ్ కు బదులుగా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. ఈ గుడ్ న్యూస్ తో బాల‌య్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. మరి వీర సింహారెడ్డి ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేర‌కు ఆకట్టుకుంటుందో చూడాలి.

https://twitter.com/MythriOfficial/status/1609927275180601344?s=20&t=dW8Zvzh7bzJw46ssHeKR5Q