వారసుడు మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ ఇవే..!!

ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన సినిమా ‘వారసుడు’. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషలో ఒకేసారి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగు వారసుడు సినిమాని పోస్ట్‌పోన్ చేయగా, తమిళ్ వెర్షన్ ‘వారిసు’ సినిమాని మాత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి తమిళంలో వారిసు సినిమా ఎలాంటి టాక్ దక్కించుకుంటుంది, సినిమా స్టోరీ ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ప్రముఖ వ్యాపారవేత్తలలో రాజేంద్రన్ ఒకరు. అతనికి ముగ్గురు కొడుకులు. వారిలో మూడో వాడు విజయ్. రాజేంద్రన్ తరువాత తన వ్యాపార బాధ్యతలు అన్ని ఏ కొడుకుకి అప్పగిస్తే బాగుంటుంది అనే దాని గురించి చింతిస్తూ ఉంటాడు. అయితే రాజేంద్రన్ స్థానాన్ని ఆక్రమించాలని అతని ఇద్దరు కొడుకులు ఆశపడుతూ ఉంటారు. మూడో కొడుకు అయిన విజయ్‌కి మాత్రం తన తండ్రి ఆస్తి మీద ఆశ ఉండదు. విజయ్ కి తండ్రి పద్ధతులు నచ్చకపోవడంతో ఇంటినుండి బయటికి వెళ్లి ఏడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉండి అతనికి నచ్చినట్లు జీవిస్తాడు.

ఒకవైపు జై ప్రకాష్ అనే వ్యక్తి నుంచి రాజేంద్రన్ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు. కొంతకాలానికి ఇంటికి వెళ్లిన విజయ్ ఈ విషయాలను తెలుసుకొని విలన్ అయిన జై ప్రకాష్ కి ఎలా బుద్ధి చెపుతాడు? అలానే ఆస్థి కోసం స్వార్ధంగా ఆలోచించే తన అన్నలలో మార్పు ఎలా తీసుకొచ్చాడు? అనేదాని గురించి ఈ వారసుడు సినిమా. ఇక సంక్రాంతి పండుగ రోజు ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా చూడాలి అనుకుంటే వారసుడు సినిమా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో పాటలు, విజయ్ నటన కామెడీ, యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.

అయితే ఇప్పటికే మనం చూసిన చాలా తెలుగు సినిమాలలానే ఈ సినిమా కూడా ఉంది. ప్రత్యేకించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు. అలానే కొన్ని సీన్స్ బాగా సాగదీసినట్లుగా ఉండటం ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. వేరే సినిమాలతో పోటీ పడకుండా సోలోగా వారసుడు సినిమా రిలీజ్ అవుతూనే తెలుగు రాష్ట్రాల్లో అది సక్సెస్ సాధించగలదు.