ఆ హీరోయిన్ విషయంలో స్టార్ నిర్మాతను కొట్టిన స్టైలిష్ విలన్.. అసలు ఏం జరిగిందంటే..!

టాలీవుడ్ సీనియర్ నిర్మాత దర్శకుడు అయిన విబి. రాజేంద్రప్రసాద్ వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన సీనియర్ నటుడు జగపతిబాబు ఫ్యామిలీ సినిమాలలో నటిస్తూ హోమ్లీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినన జగపతిబాబు అతి తక్కువ సమయంలోనే మంచి పేరును సొంతం చేసుకుని కెరీర్ పరంగా అంతకు అంతకు దూసుకుపోతున్నాడు.

ఈ క్రమంలోనే జగతిబాబు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్‌ల‌లో, తన సినీ కెరీర్ లో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ.. నా కెరీర్ మొదటిలో ఓ నిర్మాతను నేను కొట్టానని ఆయన చెప్పుకొచ్చాడు… ‘ఇక నేను నా కెరీర్ మొదటిలో ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆ నిర్మాత హీరోయిన్ విషయంలో తప్పు చేస్తే అతనిని కొట్టానని జగపతిబాబు చెప్పాడు’. ‘ఆ నిర్మాత ఇప్పుడు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ ప్రొడ్యూసర్ లో ఒకరిగా ఉన్నారని ఆయన కామెంట్లు చేశారు’.

Telugu Godfather, Jagapatibabu, Legend, Tollywood, Villain-Movie

ఇక సినిమా అవకాశాల కోసం మీ మనసును చంపకోవద్దని ఆయన వెల్లడించడం గమనార్హం.ఇక తన ఫ్యామిలీ విషయాల గురించి మాట్లాడుతూ తన కూతురు తన అల్లుడు ఎంతో హ్యాపీగా ఉన్నారని. ఇక నా అల్లుడు అంటే నాకు ఎంతో ఇష్టమని.. అలాంటి భర్త నా కూతురు దొరకటం నాకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు రెమ్యూనిరేషన్ కూడా ఎవరు ఊహించని స్థాయిలో పెరిగింది. ఒక హీరో కన్నా విలన్ పాత్రుల తోనే జగతిబాబు స్థాయి అంతకంతకు పెరుగుతుందని చెప్పటంలో అతిశయోక్తి లేదు.