పవన్ కళ్యాణ్‌ను గుడ్డు మీద ఈకలా తీసి పారేసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్…??

 

ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో డైరెక్టర్ లేదా నిర్మాతని పిలిచి మీతో సినిమా చేస్తానని చెప్తే ఆ దర్శకుడు లేదా నిర్మాత ఎగిరి గంతేసి వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక నిర్మాతకి అవకాశం ఇస్తే అతను మాత్రం నాకు టైమ్‌ లేదు అని మొహం మీదే చెప్పేసాడట. అసలు అది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియదు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. దర్శకులు అడగ్గానే సినిమా చేస్తా అని చెప్పి ఆ తరువాత ఏళ్ల తరబడి వాళ్లని ఖాళీగా కూర్చోబెట్టి ఆదాయం లేకుండా పవన్ చేస్తున్నాడు అని కామెంట్స్ వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు పవన్ కళ్యాణ్ కి దాదాపు నలభై కోట్లకు పైగా అడ్వాన్స్‌లు ఇచ్చి నాలుగైదు ఏళ్ల నుంచి వాటికీ వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నారట. అయినా కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి స్పందన లేదనే టాక్ కూడా నడుస్తుంది. ఇక నిర్మాత ఎ.ఎమ్ రత్నం తీస్తున్న సినిమా కూడా సక్రమంగా ముందుకు కదలడం లేదు. పీపుల్స్ మీడియా సినిమా, డీవీవీ దానయ్య సినిమా పరిస్థితి అలానే ఉంది.

ఇలా ఎక్కడి సినిమాలు అక్కడే పెండింగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఒక నిర్మాతను పిలిచి పూజ చేసుకో సినిమా చేస్తా అని చెప్పినట్లు సమాచారం. ఆ నిర్మాత చాలా ఏళ్ల నుండి పవన్ తో వుంటున్నారట. అంతేకాకుండా ఎన్నో పెట్టుబడులు కూడా పెట్టారని తెలుస్తుంది. అయితే పవన్ అతనితో సినిమా తీయాలి అనుకున్నాడు కానీ ఆ నిర్మాత మాత్రం ప్రస్తుతం తనకు ఆరోగ్యం బాలేదని, సినిమా చేయాలేనని అని చెప్పి పవన్ కళ్యాణ్ భారీ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఈ వార్త విన్న తరువాత చాలామంది పవన్ కళ్యాణ్ బుకాయించే తీరు చూసి ఆ నిర్మాత తప్పించుకొని ఉంటారని అంటున్నారు.