బిగ్ అప్డేట్: సలార్ సినిమాలో మరో పాన్ ఇండియా హీరో.. ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులో సలార్ కూడా ఒకటి.. ఈ సినిమాను కేజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడుగా గుర్తింపు తెంచుకున్న ప్రశాంత నీల్ తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ప్రశాంత్- ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టు భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.

Sky-Rocketing Expectations on Prabhas Salaar Teaser

ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మరో పాన్ ఇండియా హీరో నటించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు గతంలో కూడా ఇదేరకంగా వైరల్ గా మారిన ఇప్పుడు దీనికి బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాల్లో ప్రభాస్ తో పాటు కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యాష్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.

Salaar Movie Official Trailer Look | Prabhas | Rocking Star Yash | KGF 3  Connection | Prashanth N - YouTube

ఈ సినిమాలో యాష్‌ కచ్చితంగా కనిపిస్తాడని కన్నడ మీడియాలో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం ఇది సినీ అభిమానులకు పండగే.. ఈ ఇద్దరు పాన్ ఇండియా హీరోలు కాబట్టి ఈ సినిమాకి ఎవరు ఊహించని స్థాయిలో క్రేజ్ రావడం మాత్రం ఖాయం. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, టాలీవుడ్ సీనియర్ హీరో జగతిబాబు కూడా పలు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

Share post:

Latest