టీడీపీ-జనసేన పొత్తు..సీట్ల లెక్కల్లో కొత్త ట్విస్ట్?

టీడీపీ-జనసేన పార్టీల పొత్తు దాదాపు ఫిక్స్ అయిపోయిందనే చెప్పాలి..అధికారికంగా ఇంకా పూర్తి ప్రకటన రాలేదు గాని..అనధికారికంగా మాత్రం పొత్తుపై రెండు పార్టీలు ఫిక్స్ అయ్యాయి. తాజాగా పవన్ సైతం వైసీపీని గద్దె దించడానికి ఓ వ్యూహం కావాలని, టీడీపీతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు భరోసా ఇచ్చి తనకు అండగా నిలబడితే ఒంటరిగా వెళ్లడానికైనా రెడీ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్తితి లేదని, గత ఎన్నికల్లో అలాగే ప్రజలని నమ్ముకుని బరిలో దిగి గాయాలపాలయ్యనని చెప్పుకొచ్చారు.

ఒంటరిగా వెళ్ళి వీరమరణం చెందాల్సిన అవసరం లేదని పవన్ చెప్పుకొచ్చారు. అంటే పరోక్షంగా పొత్తుకు రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ గౌరవం తగ్గకుండా పొత్తుకు వెళ్తామని అన్నారు. అయితే పవన్ మాటలు బట్టి టీడీపీ-జనసేనల పొత్తు ఫిక్స్ అని అర్ధమవుతుంది. కాకపోతే జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది మాత్రం క్లారిటీ లేదు. ఇంకా సీట్ల పంపకాలపై క్లారిటీ రాలేదు.

కానీ పవన్ తాజాగా మాట్లాడిన మాటలు బట్టి చూస్తే..ఆయన 50 సీట్లు వరకు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో 53 సీట్లలో జనసేన ప్రభావం చూపగలిగిందని, ఆ సీట్లలో ఓట్లు చీలడం వల్ల వైసీపీకి మేలు కలిగిందని చెప్పుకొచ్చారు. అంటే 50 సీట్లు ఈ సారి పొత్తులో కావాలని పరోక్షంగా అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ అన్నీ సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉంటుందా? అన్నీ సీట్లలో టీడీపీ నేతలు త్యాగం చేయడం అయ్యే పని కాదు.

ఎందుకంటే 175 స్థానాల్లో టీడీపీకి నాయకులు ఉన్నారు..అలాంటప్పుడు ఎక్కువ సీట్లు టీడీపీ త్యాగం చేయడమనేది కష్టమైన పని.