సక్సెస్ తో రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సుధీర్..?

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు. ప్రస్తుతం సుధీర్ కెరియర్ చాలా గ్రాఫ్ లో ఎవరు ఊహించని స్థాయిలో పెరిగిపోయిందని చెప్పవచ్చు. కమెడియన్గా, హోస్ట్ గా కథానాయకుడిగా మెల్లమెల్లగా ఎదుగుతూ ఉన్నారు సుధీర్. ఇక ఆర్థికంగా కూడా తను మరింత బలంగా నిలదొక్కుకోవడానికి పలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇటీవల సుధీర్ నటించిన గాలోడు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకొని బుల్లితెర పైన అడుగు పెట్టారు. దీంతో బుల్లితెరపై అడుగుపెట్టగానే సుధీర్ రెమ్యూనరేషన్ పై హాట్ టాపిక్ గా మారుతోంది.

Sudigali Sudheer: హీరోగా హిట్ కొట్టిన తరువాత సుధీర్ బిగ్గెస్ట్ షో.. ఈసారి  అంతకుమించి రెమ్యునరేషన్! | Sudigali sudheer shocking remuneration for star  maa sankranti special show - Telugu ...

సుడిగాలి సుదీర్ మొదట మెజీషియన్ గా స్టేజ్ పైన ఎన్నో షోలు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు సినిమాలలో ఎలాగైనా అవకాశాలు అందుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలోనే జబర్దస్త్లోకి అడుగు పెట్టారు. అలా ఒక్కసారిగా సుధీర్ రేంజ్ మారిపోయింది. చాలా కాలం పాటు జబర్దస్త్ లో రైటర్ గా కమెడియన్ గా టీం లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పలు రియాలిటీ షోలలో కూడా యాంకర్ గా చేయడంతో బాగా వర్క్ అవుట్ అయింది.

సుధీర్, రష్మీ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి ఏదైనా షో చేశారంటే చాలు అ షోకి టిఆర్పి రేటింగ్ లో మొదటి స్థానంలో ఉంటుంది. అలా నెమ్మదిగా పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో కనిపిస్తున్న సమయంలోనే హీరోగా కూడా పలు ప్రయత్నాలు చేశారు. ఇప్పటికీ సక్సెస్ గా పేరు పొందారు సుధీర్. ఇటీవల గాలోడు సినిమా రూ.7 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. తాజాగా సంక్రాంతికి .. మా సంక్రాంతి పందెం అనే స్పెషల్ ఎపిసోడ్ ను చేయబోతోంది ఇందులో మొదటిసారిగా పోస్ట్ గా వ్యవహరిస్తున్నారు సుదీర్.. ఈ షో కి దాదాపుగా రూ.4 లక్షల తీసుకున్నట్లు సమాచారం.