సక్సెస్ వచ్చిన సైలెంట్ గా ఉన్న శృతిహాసన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శృతిహాసన్ గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం కాస్త సినిమాలకు దూరంగా ఉంటూ మళ్లీ క్రాక్ సినిమాతో తన హవా మొదలుపెట్టింది. అటు తరువాత ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. అందులో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలలో చిరంజీవి బాలయ్యకు జోడిగా నటించి మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ప్రమోషన్లలో కూడా ఈమె పెద్దగా పాల్గొన్నట్లు కనిపించలేదు.

Shruti Haasan drops release date of new show 'Bestseller' co-starring  Mithun Chakraborty | Web Series
అలాగే ఎవరికి వారు తమ సినిమాల విషయంలో అంటూ అటు చిరంజీవి,బాలకృష్ణ సొంతంగా వారికి వారే ఆకాశానికి ఎత్తేసుకున్నారు.. తప్ప ఇందులో నటించిన వారి పైన ఆశించిన స్థాయిలో మాట్లాడలేదని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమాలో ప్రకాష్ రాజు తో పాటు బాబి సింహ కూడా పవర్ఫుల్ పాత్రలో నటించారు. అయితే వాల్తేర్ వీరయ్య సక్సెస్ మీట్ లో వారి ప్రస్తావన పెద్దగా లేదని మాట వినిపిస్తోంది. ఇక శృతిహాసన్ గురించి కూడా పెద్దగా మాట్లాడలేదని సమాచారం. అయితే ఈ సినిమాల సెలబ్రేషన్స్ కి కూడా శృతిహాసన్ కావాలనే దూరంగా ఉందా అనే అనుమానాలు కూడా అభిమానులలో కలుగుతున్నాయి.

స్టార్ హీరోల సినిమాలు అంటే వారి భజన తప్ప మిగిలిన వారికి ఎలాంటి క్రెడిట్ ఉండదు.ఈ విషయం అర్థం చేసుకున్న శృతిహాసన్ సైలెంట్ గా ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి సీనియర్ స్టార్స్ విషయంలో శృతిహాసన్ కి పెద్దగా క్రెడిట్ రాకపోయేసరికి.. ప్రభాస్ తో నటిస్తున్న సలార్ సినిమా విషయంలో శృతిహాసన్ పేరు వినిపిస్తుందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.. మరి ఈ సినిమా ఈవెంట్లోనైనా ఈమెకు క్రెడిట్ వస్తుందేమో చూడాలి.

Share post:

Latest