టికెట్ల బుకింగ్ విషయంలో ఆర్ఆర్ఆర్ వరల్డ్ రికార్డ్..

ఆర్ఆర్ఆర్ 2022లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఆ అంచనాలకు మించి బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకి రికార్డులను బద్దలు కొట్టింది. బాక్సాఫీస్ వద్ద రూ.1,200 కోట్ల వసూలు చేసి ఇది రికార్డు సృష్టించింది. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ మూవీ హిట్ అయింది. ముఖ్యంగా అమెరికాలో ట్రిపుల్ ఆర్ సినిమా కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డులను సాధించింది. కాగా తాజాగా ఈ సినిమా ఇప్పుడు మరో తాజా రికార్డు సృష్టించింది. అదేంటో తెలుసుకుంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్ లాస్ ఏంజిల్స్ లో ఉంది. దాని ‘TSL చైనీస్ థియేటర్’.

ఈ భారీ థియేటర్‌లో #RRR మూవీని జనవరి 9న విడుదల చేయడానికి మూవీ యూనిట్ సిద్ధమైంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కొద్ది గంటల క్రితమే ఓపెన్ చేసింది. కాగా ఈ విషయం తెలిసిన సినీ ప్రేమికులు టికెట్లను విపరీతంగా కొనేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన 98 సెకండ్స్ లోనే 1,000 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అంటే రెండు నిమిషాల కంటే తక్కువ సమయంలోనే 1000 టికెట్లు అమ్ముడుపోయాయన్నమాట. ఇంత తక్కువ సమయంలో ఎన్ని టికెట్లు అమ్ముడు కావడం ఉంటే మామూలు విషయం కాదు.

అందుకే విశ్లేషకులు ఇది ప్రపంచ రికార్డు అని చెబుతున్నారు. ఈ సినిమాకి అమెరికాలో స్థిరపడిన భారతీయులే వెళ్తారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అమెరికన్స్ కూడా ఈ టికెట్ బుకింగ్స్ లో ఉన్నారు. ఏదేమైనా రాజమౌళి సినిమాలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏ ఇండస్ట్రీ చేరుకోలేని ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నారు