జపాన్​లో `ఆర్ఆర్ఆర్‌` రికార్డు.. ఆనందంతో ఉప్పొంగిపోతున్న జ‌క్క‌న్న‌!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్` గత ఏడాది మార్చిలో విడుదలై ఎంతటి సంచలన‌ విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. విడుదలై ఇన్ని నెలలు గ‌డుస్తున్నా ఆర్ఆర్ఆర్ మ్యానియ‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది.

తాజాగా జపాన్ లో మరో రికార్డును సృష్టించింది. జపాన్ దేశంలో ఈ చిత్రం 100 రోజులను పూర్తి చేసుకుంది. దీంతో ఆనందంతో ఉప్పొంగిపోతున్న జ‌క్క‌న్న తాజాగా ఓ ట్వీట్ చేసి జ‌పాన్ ప్రేక్ష‌కుల‌ను కృత‌జ్ఞాత‌లు తెలిపారు. `ఆ రోజుల్లో ఒక సినిమా 100 రోజులు, 175 రోజులు నడుస్తుండటం చాలా పెద్ద విషయం. కాలక్రమేణా వ్యాపార స్వరూపం మారిపోయింది.. ఆ మధుర జ్ఞాపకాలు పోయాయి. కానీ జపనీస్ అభిమానులు మాకు ఆనందాన్ని కలిగించారు. లవ్ యూ జపాన్` అంటూ రాజ‌మౌళి త‌న ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రిచారు.

కాగా, 2022 అక్టోబర్ 21న జపాన్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలైంది. మేక‌ర్స్ చేసిన ప్ర‌మోష‌న్స్ తో ఈ చిత్రం జ‌పాన్ లో భారీ ఓపెనింగ్స్ ను రాబ‌ట్టింది. జపాన్ లో మెుదటి రోజు సుమారు రూ.1.06 కోట్లు రాబట్టింది. జపాన్ లో విడుదలైన భారతీయ చిత్రాలన్నింటికంటే.. ఆర్ఆర్ఆర్ ఎక్కువ ఓపెనింగ్స్ సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు వంద రోజుల‌ను పూర్తి చేసుకుని మ‌రో రేర్ రికార్డ్ ను క్రియేట్ చేసింది.

Share post:

Latest