పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే కౌంటర్ వేసిన ఆర్జీవి..!!

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వైరల్ గా మారుతూ ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల పైన ప్రతిపక్ష నేతల పైన ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదం చేస్తూ ఉంటారు రాంగోపాల్ వర్మ. హైదరాబాదులో చంద్రబాబు నివాసంలో జరిగిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కిస్తోందని చెప్పవచ్చు. దీంతో ఒక్కసారిగా కొంతమంది రాజకీయ నాయకులు ఒరేంజ్ లో ఫైర్ అయ్యారు పవన్ చంద్రబాబుల భేటీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని కేవలం చంద్రబాబు తన పార్టీని రక్షించుకొనే కోసమే అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు.

Fans are fuming over director Ram Gopal Varma's controversial comments on Pawan  Kalyan and Chandrababu's meeting
ఇక ఈ విషయంపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా స్పందిస్తూ పలు రకాల కామెంట్లతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. రాంగోపాల్ వర్మ ఇలా రాసుకుంటూ.. చంద్రబాబు, పవన్ మీటింగ్ విషయాన్ని నేరుగా ప్రస్తావించని రాంగోపాల్ వర్మ అసలు విషయాన్ని చెప్పగానే చెప్పేశారు. కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని.. కమ్మలకి అమ్మేస్తున్నాడని ఊహించలేదు..RIP కాపులు, కంగ్రాట్యులేషన్ కమ్మొలు అంటూ రాసుకొచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా రాంగోపాల్ వర్మ షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతొంది.

కానీ వర్మ ట్విట్టర్ లో మాత్రం చంద్రబాబు పవనుల పేరును ప్రస్తావించకపోయినప్పటికీ నేటిజెన్లు మాత్రం అసలు విషయం ఏంటో అర్థం అయింది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ పై కొందరు పాజిటివ్గా స్పందిస్తుంటే..మరి కొందరు మాత్రం నెగిటివ్గా స్పందిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో కాస్త ఆసక్తిగా ఉన్నారని చెప్పవచ్చు.

https://twitter.com/RGVzoomin/status/1612140991884185600?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1612140991884185600%7Ctwgr%5E94e18ca33b4377d77e4121effff29554d1c89f45%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Fsensational-director-ram-gopal-varma-comments-on-pawan-kalyan-and-chandrababu-meeting-au57-864135.html