ఆ విషయంలో సుకుమార్‌ని ఫాలో అవుతున్న రాజమౌళి..!!

 

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చెయ్యాలంటే ఆ డైరెక్టర్ చాలా హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. లుక్స్ పరంగా హాలీవుడ్ సినిమా హీరోస్ కు ఏ మాత్రం తగ్గడు మన “రాజ కుమారుడు”. మహేష్ తో సినిమా అంటే హాలీవుడ్ రేంజ్ లో ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తున్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ తో జక్కన్న క్రేజ్ మరో లెవెల్‌కు వెళ్ళింది. ఈ నేపథ్యంలో మహేష్ కోసం కంటెంట్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాడు జక్కన్న. ఇప్పటికే కథ విషయమై తండ్రి రాజేంద్రప్రసాద్ తో జక్కన్న చర్చించారు.

నిజానికి మహేష్ ను హాలీవుడ్ రేంజ్ లో చూపించడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారు. వన్ నేనొక్కడినే సినిమాతో మహేష్ రేంజ్ ను మరో లెవెల్‌కు తీసుకు వెళ్ళాడు సుక్కు. ఈ సినిమాలో మహేష్ లుక్స్ అండ్ అప్రోచ్ వేరే లెవెల్లో ఉంటాయి. కమర్షియల్ గా ఈ సినిమా పెద్ద విజయం సాధించనప్పటికీ మహేష్ కెరీర్‌లో ఒక డిఫరెంట్ మూవీ గా నిలిచిపోయింది. దాంతో ఇప్పుడు జక్కన్న కూడా సుక్కును ఫాలో అవుతున్నాడు అంటూ ఇండస్ట్రీ టాక్‌.

వన్ నేనొక్కడినే సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఆస్ట్రేలియా బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేసుకున్నాడట జక్కన్న. అయితే లుక్స్ అండ్ అప్రోచ్ విషయంలో సుక్కు ఫాలో అయిన విషయాలనే ఫాలో అవుతూ కంటెంట్ మాత్రం తన స్టైల్ లో రెడీ చేసుకుంటున్నాడట రాజమౌళి. రాజమౌళి సినిమాల్లో కథ గొప్పగా లేకపోయినప్పటికీ తన స్క్రీన్ ప్లే, లీడ్ యాక్టర్స్ స్క్రీన్ ప్రజెన్స్ తో మేజిక్ చేస్తాడు. మహేష్ ఇప్పటి వరకూ పాన్ ఇండియా రేంజ్ లో ఒక్క హిట్టు కొట్టలేదు. రాజమౌళి సినిమాతో మహేష్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అవుతాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.