అనిల్ రావిపూడి బాలయ్య మూవీ నుంచి.. నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అప్డేట్ దెబ్బకి థింకింగ్ మారిపోవాల్సిందే..!

నటసింహం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటు వెండితెరపై అటు బుల్లితెరపై కూడా బాలయ్య అదిరిపోయే రేంజ్ లో అదరగొడుతున్నాడు. అఖండతో మొదలుపెట్టిన విజయాల దండయాత్ర ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డితో మరో లెవల్ కు తీసుకువెళ్లాడు బాలయ్య. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు రాబట్టుకుంది.

ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య వరుస క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. బాలయ్య లైన్ అప్ చూస్తుంటే ప్రస్తుతం ఉన్న యంగ్‌ హీరోలకు సైతం షాక్ ఇచ్చే విధంగా ఆయన దర్శకులను ఎంచుకునే విధానం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి తో తన 108వ సినిమా ఇప్పటికే మొదలు పెట్టాడు. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా ఇప్పటికే కంప్లీట్ అవ్వగా.. ఈ రెండో షెడ్యూల్ కూడా ఫిబ్రవరి 5 నుంచి మొదలు పెట్టనున్నారు మేకర్స్.

ఈ సినిమాలో బాలయ్య క్యాటరైజేషన్ గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు ఈ సినిమాలో బాలయ్యకు జంటగా నటించే హీరోయిన్‌ను కన్ఫామ్ చేయనున్నారట. టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్యకు జంటగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తొలిసారిగా బాలయ్యతో అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో అనిల్- బాలయ్య ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తారో చూడాలి.