పుసుక్కున నోరు జారిన మెగాస్టార్ చిరంజీవి… ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!!

అందరిముందు స్టేజ్ మీదకు ఎక్కి మాట్లాడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. ముందు వెనకా ఆలోచించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కాకుండా ఏదో హడావిడిగా మాట్లాడాలి కదా అని ఏదో ఒకటి మాట్లాడేసామే అనుకోండి, దాంట్లో ఏ చిన్న తప్పు దొరికినా కూడా ఆడియన్స్ దానిని పట్టుకొని నానా రచ్చ చేస్తారు. ఇలాంటి సంఘటన ఒకటి నిన్న జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి సంబంధించిన సభ నిన్న వరంగల్ లో జరిగింది. ఈ సందర్బంగా మెగాస్టార్ స్టేజ్ మీద మాట్లాడుతూ పుసుక్కున నోరు జారాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక సీన్ లో చిన్న హీరో పోస్టర్‌కి పెద్ద హీరో ముద్దు పెట్టారు అని చిరు అన్నాడు. చిరంజీవి చిన్న హీరో అని వ్యాఖ్యనించింది ఎవరినో కాదు రవితేజని. నిజానికి ఆయన అలా అనడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే రవితేజ వాల్తేరు వీరయ్య సినిమా కోసం దాదాపు 17 కోట్లు పారితోషికం తీసుకొని కీలక పాత్రలో నటించారు.

అంత రెమ్యునరేషన్ తీసుకున్న హీరో చిన్న హీరోనా? అసలు వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ పాత్ర లేకపోతే ఆ సినిమా హిట్ అయ్యేదా? ఇద్దరి హీరోల అభిమానులు థియేటర్స్‌కి రాబట్టేగా సినిమా విజయం సాధించింది. ఆ విషయం మెగాస్టార్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదో అర్థం కావడం లేదు. అసలు మన హీరోలకి ఇలా చిన్న పెద్ద అనే బేధాలు ఉంటాయి కానీ ఇతర భాషాల హీరోలు మాత్రం అలా తేడా చూపించరు. సీన్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర అయినా చెయ్యడానికి సిద్ధపడతారు.

మోహన్ లాల్ లాంటి టాప్ హీరో ఒక సినిమాలో సీన్ డిమాండ్ చేస్తే తన ఎదురుగా ఉన్న చిన్న ఆర్టిస్ట్ బూటును నోటితో టచ్ చేసాడు. నిజానికి గొప్పతనం అంటే అది. హీరో అంటే సినిమా కోసం ఏదైనా చేయగలిగే సత్తా ఉండలి. కానీ మెగాస్టార్ ఒక పోస్టర్ ని ముద్దు పెట్టుకోవడానికి చిన్న పెద్ద అని తేడాలు చూపిస్తున్నారు. ఇలా మాట్లాడితే తరవాత సినిమాలో ఆయనతో ఎవరు నటించడానికి ముందుకు వస్తారు?!