ఆ ఇద్ద‌రు డైరెక్ట‌ర్ల‌కు మ‌లినేని గోపీచంద్ స‌వాళ్లు… గెలిచి నిలుస్తాడా…!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ తో సినిమాలు చేయాలంటే చాలా కష్టం.. ఆయనకున్న మాస్ ఇమేజ్ మరి ఎవరికీ లేదని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఆయన సినిమాలు ఎంతో పవర్ ఫుల్ గా ఉంటేనే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. గతంలో బాలయ్యతో ఈ మ్యాజిక్ బి గోపాల్ చేసి చూపించాడు. ఆయనతో లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్యాక్ టు బ్యాక్ నాలుగు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఇప్పటికే బాలయ్యతో సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు ఇచ్చాడు.

HBD NBK - B Gopal: టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నట సింహా బాలకృష్ణ,  దర్శకుడు బి గోపాల్.. | Happy Birthday Nandamuri Balakrishna NBK-B Gopal  Hero Nandamuri Balakrishna director B Gopal ...

ఇప్పుడు ఈ వంతు గోపీచంద్ మలినేని కి వచ్చింది. ఈయన గతంలో రవితేజతో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్ సినిమాలు రవితేజకు అందించాడు. వీటితోపాటు వెంకటేష్ హీరోగా బాడీగార్డ్, రామ్ తో పండగ చేస్కో, సాయిధరమ్ తేజ్ తో విన్నర్ వంటి సినిమాలను తెరకెక్కించాడు. అయితే వాటిలో కేవలం రవితేజ సినిమాలతోనే ఆయన దర్శకుడుగా తన ఇమేజ్‌ను పెంచుకున్నాడు.

బాలకృష్ణ వ్య‌క్తిత్వంపై బోయ‌పాటి మైండ్ బ్లోయింగ్ కామెంట్స్‌…! - Telugu  Journalist

మాస్ యాక్షన్ సినిమాలను బాగా తెరపైకి తేగలరనే పేరు సంపాదించుకున్నాడు. వీర‌సింహారెడ్డి సినిమాలో బాలయ్యను దర్శకుడు ఎలా హ్యాండిల్ చేశాడని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే బాలయ్యను గోపీచంద్ ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేశాడని తెలుస్తుంది. గోపీచంద్ కూడా బోయపాటి, బి గోపాల్, రూట్ లోనే బాలకృష్ణతో సినిమా చేసినట్టు తెలుస్తుంది. మాస్ సినిమాల్లో తనకు ఉన్నగ్రిప్ ను బాలయ్యతో ఎంతో ఫర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారట.

అందులోను గోపీచంద్‌ బాలయ్యకు వీరాభిమాని. ఇక దాంతో ఈ సినిమా కోసం ఆయన మరింత జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది. బాలయ్యను గోపీచంద్ ఎలా చూపించాడనేది ఈ సినిమా ట్రైలర్ ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఈ ట్రైలర్‌ను నింపేశారు. ఈ సినిమా కథ మాత్రం ఎక్కడ రివిల్ చేయలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పే డైలాగ్ లు పెద్ద ప్లస్ పాయింట్ కానున్నాయట.

Balakrishna Director Gopichand Malineni Continues The Sentiment

అసలే సంక్రాంతి.. బాలయ్య కూడా పందానికి సిద్ధంగా ఉన్న సంక్రాంతి పందెం పుంజుల మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ సినిమాతో బాలకృష్ణ మరో హిట్ గ్యారెంటీ అని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ సినిమాతో గోపీచంద్ మలినెని కూడా మరో మాస్ డైరెక్ట్ గా పేరు తెచ్చుకోవడం గ్యారంటీ. ఈ సినిమాతో బాల‌య్య‌ ఎలాంటి ? రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.