మహేష్- త్రివిక్రమ్ సినిమా అనుకున్నదే జరిగింది.. సినిమా డేట్ మారిందోచ్..!

చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూనే ఉంటారు. అలాంటిదే మహేష్, త్రివిక్రమ్ కాంబో.. వీరిద్దరి కలయికలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.. ఆ సినిమాలు కూడా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా దర్శకుడకు హీరోకు మంచి పేరు తీసుకొచ్చాయి.

ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమా ssmb28.. గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా ముగించుకుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఇంట్లో జరిగిన వరుస విషాదాల కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఎప్పుడు వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ఏకధాటిగా నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాలోని ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది.

తాజాగా మరోసారి ఈ సినిమా విషయంలో వాయిదా మాట వినిపిస్తుంది.. ఏంటి షూటింగ్ మళ్లీ వాయిదా పడుతుందనుకుంటున్నారా..? ఆ వాయిదా గురించి ఎప్పుడూ చర్చించుకునేదే.. ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా అంటున్నారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. కానీ ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ఇప్పుడు మహేష్ పుట్టినరోజు కానుకగా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేశారు.

SSMB28: Mahesh Babu and Trivikram Srinivas begin shooting - Bollywood Times  11

అయితే ఇప్పుడు ఈ తేదీ కూడా వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ మొదలవకపోవడంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. మళ్లీ ఈ సినిమాను అక్టోబర్‌లో దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. విజయదశమి రోజున అక్టోబర్ 20న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఆటైంలో లాంగ్ వీకెండ్ ఫెస్టివల్ డేస్ కారణంగా ఆ సమయంలో ఈ సినిమాకు బాగుంటుందని టీం ఆలోచనట. మరి ఈ సినిమా విడుదల తేదీలో ఇక ఎన్ని మార్పులు వస్తాయో చూడాలి.