భార్యపై హార్ట్ టచింగ్ పోస్ట్..అయ్య బాబోయ్ మహేష్ బాబు ఇంత రొమాంటిక్ ఫెలోనా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో స్వీట్ కపుల్స్ లో మహేష్ బాబు- నమ్రత జంట కూడా ఒకటి.. ఇక ఈరోజు నమ్రత జన్మదినం సందర్భంగా మహేష్ ఓ ఎమోషనల్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ పోస్టులో మహేష్ ‘హ్య‌పీ బ‌ర్త్ డే ఎన్ఎస్జీ అని పెట్టాడు. అంటే న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఘ‌ట్ట‌మ‌నేని అన్న‌దే దాని అర్థం. నా కోసం అన్ని ప‌నుల‌ను లైప్‌లో, క్ర‌మంగా పెడుతున్నందుకు ధ‌న్య‌వాదాలు’.

‘న‌న్ను ఇప్ప‌ట‌కీ మ‌రింత ముందుకు న‌డిపిస్తున్నందుకు ఎప్పుడూ నువ్వు నీలాగానే ఉన్నందుకు థ్యాంక్స్ అని బాగా ఎమోష‌న‌ల్ అయిపోయాడు’. ‘ఆ పోస్టుకు నమ్ర‌త‌ అందమైన ఫోటోను షేర్ చేసి ఆ ఫోటోకి క్యాప్షన్ గా హ్య‌పీ బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు’. ఈ జంట పెళ్లి చేసుకునే 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2005లో వీరు ముంబైలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు సితార- గౌతమ్‌ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

నమ్రత- మహేష్ లైఫ్ లోకి వచ్చాక ఈయన కెరియర్ కూడా జస్ట్ స్పీడ్ లో దూసుకుపోయింది. వరుస విజయాలను అందుకునీ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా మారిపోయాడు. మహేష్ సినిమాల పరంగా కూడా ఎన్నో మార్పులు కూడా తీసుకొచ్చింది నమ్రత.. సినిమా కథలు వినడం డేట్లు సెట్ చేయటం తన భర్త సినిమా ప్రమోషన్ల కోసం కొత్త కొత్త హంగులను క్రియేట్ చేయడం ఇలా తన భర్తను అగ్రస్థానంలో నిలబెట్టడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది నమ్రత.