కేజీఎఫ్ హీరోయిన్‌కు బంపరాఫర్.. విక్టరీ వెంకటేష్ సినిమాలో ఛాన్స్..

విక్టరీ వెంకటేష్ తన తరువాతి సినిమా ‘సైంధవ్’ పాన్ ఇండియా సినిమాగా రానుంది. దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమా అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి రెడీగా ఉన్నాడు. ఈ “సైంధవ్” సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ వెంకటేష్ నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా “సైంధవ్”లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఇందులో కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కేజీఎఫ్ చాప్టర్-1, కేజీఎఫ్ చాప్టర్-2 సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇందులో నటించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టికి క్రేజ్ అమాంతంగా పెరిగింది. అయితే అంతటి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఆమె కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసింది. చియాన్ విక్రమ్ సరసన కోబ్రా సినిమాలో మాత్రమే ఆమె నటించింది. దీంతో ఆమె కెరీర్ ఎటుపోతుందో ఎవరికీ అర్ధం కాలేదు. అందం, అభినయం ఉన్నా సినిమా ఛాన్స్ లు రావడం లేదని అంతా భావించారు. ఈ తరుణంలో వెంకటేష్ కొత్త పాన్ ఇండియా సినిమా సైంధవ్‌లో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి పేరును పరిశీలిస్తున్నారని న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే ఈ సినిమా ఆమె కెరీర్‌కు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అంతా భావిస్తున్నారు.

మరో వైపు ఘర్షణ తర్వాత ఆ స్థాయిలో పోలీస్ క్యారెక్టర్ ఉన్న సినిమా వెంకటేష్ చేయలేదు. హిట్ సినిమా ఫ్రాంఛైజీని అద్భుతంగా తెరకెక్కించిన శైలేష్ కొలను దీనికి దర్శకత్వం వహించనుండడంతో అంచనాలు పెరుగుతున్నాయ. సీరియస్ పోలీస్ పాత్రలో వెంకటేష్ నటిస్తే ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Share post:

Latest