సీమ నేతలపై కేసీఆర్ కన్ను..బీఆర్ఎస్‌లోకి లాగుతారా?

బీఆర్ఎస్ పార్టీని ఏపీలో కూడా విస్తరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న కేసీఆర్..ఏపీపై కూడా ఎక్కువగానే ఫోకస్ చేశారు. ఇక్కడ కూడా కొంత బలం పుంజుకుంటే ఎంపీ స్థానాల్లో సత్తా చాటవచ్చు అనేది కేసీఆర్ ప్లాన్. ఇప్పటికే ఏపీ బి‌ఆర్‌ఎస్ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్‌ని నియమించిన విషయం తెలిసిందే.

ఇంకా ఏపీలో ఇంకా కొందరు నేతలని చేర్చుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. ఇప్పటికే కొందరు నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే వైసీపీ,టీడీపీల్లో ఖాళీగా ఉన్న నాయకులని బీఆర్ఎస్‌లోకి తీసుకురావాలని కే‌సి‌ఆర్ ప్లాన్ చేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో సభ పెట్టి..అక్కడ కొందరు నేతలని బి‌ఆర్‌ఎస్ లో చేర్చుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. విశాఖలో బి‌ఆర్‌ఎస్ సభ ఉంటుందని ఏపీ అధ్యక్షుడు తోట ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ సభ ఎప్పుడు జరుగుతుందనేది క్లారిటీ లేదు.

అంటే ఉత్తరాంధ్రలో కీలక సమస్యలని హైలైట్ చేసి..అక్కడ ప్రజల మద్ధతు పెంచుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై గట్టిగా పోరాడాలని చూస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తావన తీసుకొచ్చారు.

అదే సమయంలో రాయలసీమపై కూడా కే‌సి‌ఆర్ ఫోకస్ పెడుతున్నారు. సీమలో కీలక నేతలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. అక్కడ ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టి..ప్రజల మద్ధతు పెంచుకోవాలని చూస్తున్నారు. అలాగే కొందరు నేతలని చేర్చుకుని బలపడాలని చూస్తున్నారు. అయితే వైసీపీ-టీడీపీల మధ్య జరుగుతున్న రాజకీయ పోరులో బి‌ఆర్‌ఎస్ ఎంతవరకు బలపడగలదు అనేది చెప్పలేని పరిస్తితి.

Share post:

Latest