అల్లు శిరీష్‌ని ఏకిపారేస్తున్న జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అతను ఏం తప్పు చేశాడంటే..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు వారి కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. అయితే నటుడిగా అల్లు అర్జున్ కి వచ్చినంత ఫేమ్ అల్లు శిరీష్ కి రాలేదు. అల్లు వారి సపోర్ట్, ఫేమస్ డైరెక్టర్ల డైరెక్షన్‌లో నటించడం వల్ల అల్లు శిరీష్ కి ఎంతోకొంత గుర్తింపు వచ్చింది. అలా శ్రీరస్తు శుభమస్తు, కొత్తజంట, ఊర్వశివో రాక్షసివో లాంటి కొన్ని సినిమాలలో నటించి మంచి ఫలితాలను అందుకున్నాడు. అయితే అల్లు శిరీష్ చాలా మంచివాడు. ఎప్పుడూ వివాదాలను సృష్టించడు. అలానే ఎవరినీ బాధపెట్టరు. కానీ తాజాగా అతడు చేసిన ఒక పని ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను బాగా బాధ పెడుతోంది. ఇంతకీ అతను చేసిన పని ఏంటి?

జస్ట్, కొద్ది గంటల క్రితం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా అంచనాలకు మించి ప్రేక్షకులను అలరించి, కలెక్షన్ల పరంగా రికార్డులను బ్రేక్ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోడెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న సందర్బంగా ఈ సినిమాపై సెలెబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా రాజకీయ నాయకులు ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్ లాంటి ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అలానే అల్లు శిరీష్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. అయితే శిరీష్ అందరినీ ట్యాగ్స్ చేశాడు, ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్ప. జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ @tarak999ని ట్యాగ్ చేయకుండా #ntrjr అని మాత్రమే పేర్కొన్నాడు. అసలయితే ఎన్టీఆర్ కి అధికారిక ట్విటర్ అకంట్ ఉంది. అయిన కూడా అల్లు శిరీష్ కావాలనే ఎన్టీఆర్ అకౌంట్‌ని ట్యాగ్ చేయలేదు. అది తారక్‌ అభిమానులను బాగా నొప్పించింది.

ఒకవేళ శిరీష్ పొరపాటు చేసి ఉంటే తరువాత అయిన అతని ట్విట్ ని ఎడిట్ చేసి ఉండొచ్చు, కానీ అలా చేయలేదంటే కావాలనే ఎన్టీఆర్ ని ప్రశంసించడం ఇష్టం లేక శిరీష్ అలా చేస్తున్నాడు అని ఎన్టీఆర్ అభిమానుకు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వీటన్నిటిని చూసి కూడా అల్లు శిరీష్ స్పందించడం లేదు. చరణ్ ని ట్యాగ్ చేసినప్పుడు, ఎన్టీఆర్ ని కూడా ట్యాగ్ చేస్తే బాగుండేది. కానీ శిరీష్ అలా హ్యాష్ ట్యాగ్ ఉపయోగించడం అనేది కరెక్ట్ కాదు అని, ఇలా ఫ్యాన్స్ ని హార్ట్ చేసేలా ప్రవర్తించడం ఏమి బాలేదని కొంతమంది కామెంట్స్ చెందుతున్నారు. అయితే త్వరలోనే అల్లు శిరీష్ ఈ వివాదంపై స్పందించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.