రష్మిక త్వరలోనే అలాంటి పని చేయబోతుందా..?

కన్నడ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించింది. రష్మిక మీద గత కొన్ని రోజులుగా రూమర్స్ , ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండ తో లవ్ రక్షిత్ శెట్టి , రిశబ్ శెట్టి మీద తన గొడవ ఇలా అన్నిటికి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే ఇంటర్వ్యూలో తన అభిమానులకు ఒక సూపర్ న్యూస్ చెప్పబోతోంది అన్నట్లుగా సమాచారం. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఈ ఇంటర్వ్యూలో అన్ని విషయాల పైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Rashmika Mandanna : రిషబ్‌ శెట్టి దెబ్బకు దిగొచ్చిన రష్మిక..

దీంతో రష్మిక లేడీ ఓరియంటెడ్ సినిమా పైన చెప్పే అవకాశం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరు నిర్మాత ఎవరు అనే అంశం పైన కూడా తెలియజేయబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో తన సినిమాలు గురించి చెప్పిన రష్మిక గుడ్ బై సినిమా ఇప్పుడు ప్రేక్షకులకు నచ్చకపోయినా కొన్నేళ్ల తర్వాత అలాంటి సినిమాలు రావాలని కోరుకుంటారని తెలియజేస్తోంది. పుష్ప -2 లో తన పాత్ర గురించి కూడా కొంత క్లూ కూడా ఇచ్చినట్లు సమాచారం.

rashmika mandanna : పుష్ప-2 పై రష్మిక క్రేజీ అప్ డేట్ - Tolivelugu  తొలివెలుగు
ఇక డైరెక్టర్ సందీప్ వంగ యానిమల్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని రణబీర్ కపూర్ , తాను ఇద్దరం కలిసి తమ పాత్రలతో షాక్ ఇస్తామని తెలియజేసింది. ఇదే కాకుండా ఇంకా చాలా విషయాలలో రష్మిక జర్నలిస్ట్ ప్రేమకు ఇంటర్వ్యూ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ప్రోమో మాత్రం వైరల్ గా మారుతోంది .ముఖ్యంగా తన మొదట ఛాన్స్ ఇచ్చిన రక్షిత్ , రిషబ్ ల గురించి కూడా చాలా కాలం తర్వాత మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గామారుతోంది.