నందమూరి కళ్యాణ్ రామ్ గత సంవత్సరం బింబిసారా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. చాలాకాలం తర్వాత ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మంచి బూస్ట్ అభిమానులకు ఇచ్చారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ మరొక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కెరియర్ ప్రారంభం నుంచి ఎన్నో వైవిధ్యమైన పాత్రలో చిత్రాలలో నటించి నేర్పించిన కళ్యాణ్ రామ్ తనదైన స్టైల్ లో ఈసారి కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాను నటిస్తున్న తాజా చిత్రం ఆమీగోష్. డైరెక్టర్ రాజేందర్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
![taran adarsh on Twitter: "JR NTR - KORATALA SIVA PAN-INDIA PROJECT: RELEASE DATE LOCKED... 5 April 2024 is the release date of #JrNTR and director #KoratalaSiva's second collaboration, after #JanathaGarage [2016]... Not](https://pbs.twimg.com/media/FlXTsMyaAAATcyW.jpg)
అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ చాలా వైరల్ గా మారి మంచి స్పందన లభించింది న్యూ ఇయర్ సందర్భంగా ఆమిగోష్ సినిమా నుంచి కళ్యాణ్ రామ్ లుక్ మరొక పోస్టర్ను మేకర్స్ విడుదల చేయడం జరిగింది. ఇందులో తన పాత్ర పేరు సిద్ధార్థ అని పోస్టర్లు కనిపిస్తోంది. ఈ పోస్టర్ పై డోపల్ గ్యాంగ్ సిద్ధార్థ్ అని రాయడం జరిగింది .దీని వెనుక అసలు విషయం తెలియాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యే వరకు ఆకాల్సిందే.

కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నది. ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన ఈ ఏడాది గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది RRR సినిమా విడుదల చేసి పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన ఇప్పటికీ తన 30 వ చిత్రం గురించి అప్డేట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. దీంతో ఎన్టీఆర్ కంటే కళ్యాణ్ రామే వెంట వెంటనే తన సినిమాలను విడుదల చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

