సంచలనం: బాలినేనికి నో సీటు?

వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చే విషయంలో డౌట్ ఉందని చెప్పవచ్చు..సిట్టింగుల అందరికీ జగన్ సీటు ఇవ్వడం కష్టమనే చెప్పాలి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. అలాంటి వారిని జగన్ పెట్టాలని చూస్తున్నారు..లేదా కొందరిని వేరే సీట్లకు మారుస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కొందరికి సీట్లు ఇచ్చే విషయంలో జగన్ క్లారిటీ ఇచ్చినట్లే కనిపిస్తోంది. దాదాపు కొందరిని సైడ్ చేస్తున్నారనే చెప్పవచ్చు. అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట.

రాష్ట్రంలో మహిళా ఓటర్లు ఎక్కువ..పైగా మహిళలకే పథకాలు అందుతున్నాయి. దీంతో మహిళా ఓటర్ల మద్ధతు మరింత పొందేందుకు మహిళా అభ్యర్ధులని బరిలో దించుతారనే ప్రచారం ఉంది. ఇదే సమయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన సీటు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.  వచ్చే ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని జగన్ చెబుతున్నారని, రానున్న ఎన్నికల్లో తనకు కూడా టికెట్ రాకపోవచ్చని, తన సతీమణి సచీదేవికి టికెట్ ఇస్తారేమో అని చెప్పుకొచ్చారు. “నీకు సీటు లేదు.. నీ భార్యకిస్తామని” జగన్ అంటే చేసేదేమీ లేదని, మహిళలకే ఇస్తామని తేల్చిచెబితే తానైనా పోటీ నుంచి వైదొలగకతప్పదన్నారు.

అంటే తన సీటు విషయంలోనే బాలినేనికి గ్యారెంటీ లేదు.అదే సమయంలో ఇంకా కొన్ని సీట్ల విషయంలో గాని..ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలని తప్పించి..అక్కడ మహిళా అభ్యర్ధులకు ఏమైనా అవకాశం ఇస్తారేమో చూడాలి. అందుకే పరోక్షంగా బాలినేని ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఈ సారి వైసీపీ నుంచి ఎంతమంది మహిళా అభ్యర్ధులు రంగంలోకి దిగుతారో.