ఇంట్రెస్టింగ్: ఎవరూ ఊహించిన విధంగా అనిల్-బాలయ్య మూవీ టైటిల్…కెవ్వు కేక..!

గాడ్ ఆఫ్ మాసస్ నట‌సింహ నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలతో తన కెరీర్లో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలుపెట్టిన ఈ విజయ దండయాత్ర ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి తో మరో రేంజ్‌కు తీసుకువెళ్లాడు బాలయ్య. ఇక ఇటు సినిమాలతో పాటు బుల్లితెరపై ఆన్ స్టాపబుల్ షో తో కూడా దుమ్ము రేపుతున్నాడు బాలకృష్ణ. ఇప్పుడు ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వగా. ఇక వచ్చేనెల 5వ తారీఖు నుంచి రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఫీలింగ్ సర్కిల్లో వైరల్ గా మారింది. ఈ సంక్రాంతికి వచ్చిన వీర‌ సింహారెడ్డి సినిమా బంపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాపై కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ఎవరు ఊహించని టైటిల్ ని కన్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది.

ఇప్పటివరకు ఈ సినిమాను nbk108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి ”రామారావు గారు” అనే టైటిల్ ని ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఈ సినిమాలో బాలయ్య తన పాత సినిమాలుకు భిన్నంగా ఎంతో కొత్తగా కనిపించబోతున్నాడని కూడా తెలుస్తుంది. ఇక ఎప్పుడూ రాయలసీమ యాసలో డైలాగులు చెప్పే బాలయ్య ఈ సినిమాలో మాత్రం తెలంగాణ యాసలో తన డైలాగులతో అదర కొట్టబోతున్నాడు అంటూ ఇప్పటికే దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఇక మరి ఈ సినిమాతో అనిల్- బాలయ్య ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.