జూనియర్ ఎన్టీఆర్ న‌టించిన సీరియ‌ల్ ఏదో తెలుసా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి మూడోతరం నటుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏమిటంటే ఎన్టీఆర్ సీరియల్లో నటించాడా.. ఇది ఎప్పుడు జరిగింది అని చాలామంది ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే ఇలాంటి స్టార్ హీరో సీరియల్స్ లో చేయడమంటే మాటలు కాదు.. అయితే ఇదంతా జరిగి చాలా సంవత్సరాలు అవుతుందట.

తారక్ సినిమాలోకి హీరోగా ఎంట్రి ఇవ్వకముందు ఓ సీరియల్ నటించాడు. అది కూడా చాలామందికిి తెలియదు. ఇక ఎన్టీఆర్ ముందుగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం సినిమాలో రాముడిగా నటించి మెపించాడు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు హీరోగా నిన్ను చూడాలని ఉంది సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.

Jr NTR looks unmissable in rare pics from debut film Bala Ramayanam - India  Today

జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలోనే కూచిపూడి నాట్యం నేర్చుకున్నాడు.. ఆ సమయంలోనే భర్త మార్కండేయ అనే సీరియల్లో ఆయన నటించారు. ఇక ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ సీరియల్ ని కూడా ఈటీవీ మొదలు పెట్టిన కొత్తలో వచ్చింది. అది కూడా చాలా తక్కువ రోజులే ప్రసారమైంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మార్కండేయుడిగా నటించాడు. శివ భక్తుడుగా అందరి మనసులు గెలుచుకున్నాడు ఎన్టీఆర్‌.

ఆ గెటప్‌లో ఉన్న ఫోటోలు ఎప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలా జూనియర్ ఎన్టీఆర్ తన చిన్నతనంలోనే బుల్లితెరపై నటించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకుని. వరుస పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.

Share post:

Latest