డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాకైపోతారు!

ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. డాన్ శీను సినిమాతో 2010లో దర్శకుడుగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత బాడీ గార్డ్, బలుపు, పండగ చేస్కో, విన్నర్ వంటి చిత్రాలకు గోపీచంద్ దర్శకత్వం వహించాడు. వీటిల్లో విన్న‌ర్ మిన‌హా మిగిలిన చిత్రాలు అన్నీ మంచి విజ‌యం సాధించాయి.

అయితే గోపీచంద్ కెరీర్ కు ట‌ర్నింగ్ పాయింట్ `క్రాక్‌`. ఈ సినిమాతో గోపీచంద్ మ‌లినేని పేరు టాలీవుడ్ లో మారు మోగిపోయింది. క్రాక్‌ అనంతరం నట‌సింహం నందమూరి బాలకృష్ణతో `వీర సింహారెడ్డి` మూవీని తెర‌కెక్కించి.. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాక్ ఎలా ఉన్నా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు పడటంతో గోపీచంద్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. అలాగే తన తొలి రమ్యునరేషన్ గురించి కూడా ప్రస్తావించాడు. అసలు గోపీచంద్ మలినేని తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు. కెరీర్‌ ఆరంభంలో శ్రీహరి హీరోగా నటించిన `పోలీస్` సినిమాకు గోపీచంద్ సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అలా ఈ సినిమాకు వర్క్ చేసినందుకు వెయ్యి రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారట. సినీ పరిశ్రమలో అదే గోపీచంద్ అందుకు తొలి రెమ్యునరేషన్ అట.